English   

ఆది అర్జున్ పండిట్ గా అదరగొట్టాడుగా

Operation-Gold-Fish
2018-11-07 15:02:37

ఆది సాయికుమార్.. కుర్రాడు తెలుగు ప్రేక్షకులతో మీ ప్రేమకావాలి అంటూ లవ్ లీగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ రెండు సినిమాల్లో ఆదిని చూసిన అందరూ తండ్రి సాధించలేనిది(స్టార్ హీరో అన్న ట్యాగ్) సాధించేలా ఉన్నాడు.. అనుకున్నారు. చాలామంది ఇండస్ట్రీ పెద్దలు కూడా అతని ఈజ్ కు పడిపోయారు. కానీ కుర్రాడు సడెన్ గా మాస్ హీరో అయిపోవాలని కలలు కన్నాడు. కట్ చేస్తే కండలు పెంచాడు.. తనకంటే రెండుడుగులు పెద్దగా ఉన్న విలన్స్ ను పిండి చేశాడు. ఇదంతా బానే ఉంది కానీ.. ఈ మాస్ మాయలో పడిపోయి కథలు పట్టించుకోలేదు. ఈసారి ప్రేక్షకులు ఆది సినిమాలు చూడ్డం కట్ చేశారు. దీంతో వరుసగా సినిమాలన్నీ పోయాయి. అప్పటికి కానీ మనోడికి గరమ్ తగల్లేదు. ఈ లోగా సడెన్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు. కూతురుపుట్టింది. కానీ ఖాళీ అయిపోయాడు. చేతిలో సినిమాల్లేక ఓ దశలో కన్నడకూ వెళదామనుకున్నాడు. బట్ అనూహ్యంగా లక్ మళ్లీ తగిలింది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆది డైరీలో మూణ్నాలుగు సినిమాలున్నాయి. అందులో మొదటిది ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’.

ఈ దీపావళి పండగ సందర్భంగా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సింపుల్ గా చెబితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలీ లుక్ ను. యస్.. ఆది.. ‘అర్జున్ పండిట్’ అనే కమెండో పాత్రలో నటిస్తున్నాడు. అతని సరసన ఎయిర్ టెల్ యాడ్ బ్యూటీ ‘సాషా ఛెత్రీ’ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. మంచు కొండల్లో ఆపద నుంచి పారిపోతోన్న ఓ గ్యాంగ్.. ఆ పక్కనే ఆధునిక ఆయుధంతో ఆగ్రహంగా చూస్తోన్న ఆది సాయికుమార్.. ఓ స్టిల్ ఇమ్మీడియెట్ గా ఎట్రాక్ట్ చేయడానికి ఇంతకు మించిన స్టఫ్ ఏముంటుంది. నిజంగానే ఆది లుక్ కూడా అద్దిరిపోయింది. కొన్నాళ్ల క్రితం కృష్ణుడు హీరోగా వినాయకుడు అనే సినిమా తెరకెక్కించిన దర్శకుడు అడివి సాయికిరణ్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఈ కథలో అడివి శేష్ కలం కూడా ఉందని టాక్. మొత్తంగా ఈ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తో ఆది మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. 

More Related Stories