English   

సమరానికి రెడీ అంటున్న కమల్ హాసన్

Kamal Haasan Official Statement on Tamil Nadu Bypolls
2018-11-08 07:44:13

క‌మ‌ల్ హాస‌న్ ఇన్నాళ్ల‌కు ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చాడు. ఈయ‌న ఇక‌పై రాజ‌కీయాల‌తో ఫుల్ బిజీ కానున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు, రాజ‌కీయాలంటూ రెండు ప‌డ‌వ‌ల ప్రయాణం సాగించిన క‌మ‌ల్ ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి కూడా వ‌స్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈయ‌న త‌న పార్టీని ఎన్నిక‌ల బ‌రిలో నిల‌బెడుతున్నాడు. అంతేకాదు.. బై ఎల‌క్ష‌న్స్ లోనే లోక‌నాయ‌కుడు త‌న పార్టీ మక్కల్ నీది మయ్యం (MNM) నుంచి అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌డానికి పిక్స్ అయ్యాడు. తమిళనాడులో 20 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న బై ఎల‌క్ష‌న్స్ లో ఈయ‌న MNM  పోటీ చేస్తుందని చెప్పాడు క‌మ‌ల్ హాస‌న్. ఎన్నికలు ఎప్పుడు జ‌రుగుతాయో తెలియ‌దు కానీ ఎప్పుడు జరిగినా తాము పోటీకి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పాడు ఈ లోక‌నాయ‌కుడు. క‌మ‌ల్ మాట‌ల‌తో త‌మిళ‌నాట రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది.

ప్ర‌స్తుతం తమిళనాడులో 18 స్థానాల‌కు పోటీ జ‌ర‌గ‌నుంది. అన్నాడీఎంకేతో తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేసిన దినకరన్ వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసాడు పార్టీ అధిష్టానం. ఆ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సైతం సమర్థించింది. దాంతో ఇప్పుడు ఖాళీ అయిన ఆ 18 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. దానికితోడు తిరువారూర్ ఎమ్మెల్యే క‌రుణానిధి.. తిరుపరన్‌కుంద్రమ్ ఎమ్మెల్యే ఏకే బోస్ మ‌ర‌ణించ‌డంతో  మ‌రో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అలా మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటితోనే త‌మ స‌త్తా నిరూపించుకుంటాం అని చెబుతున్నాడు క‌మ‌ల్ హాస‌న్. ఇక 2019లో జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మొత్తం 234 స్థానాల‌కు పోటీ చేస్తామ‌ని చెప్పాడు లోక‌నాయ‌కుడు. మ‌రి ఈయ‌న పొలిటిక‌ల్ జ‌ర్నీ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌.

More Related Stories