English   

మాస్ మహారాణి సాయిపల్లవి

Sai Pallavi Maari 2 First Look Unveiled by Dhanush
2018-11-08 07:59:16

సాయిప‌ల్ల‌వి ఇప్పుడు ఏం చేసినా ట్రెండే. ఆమె ఫాలోయింగ్ అలా ఉంది మ‌రి. చేసింది త‌క్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయిప‌ల్ల‌వి. ఇప్పుడు తెలుగుతో పాటు త‌మిళ‌నాట కూడా వ‌ర‌స సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం అక్క‌డ రెండు సినిమాల‌తో బిజీ బిజీగా ఉంది సాయిప‌ల్ల‌వి. ఒక‌టి సూర్య‌తో ఎన్టీకే.. మ‌రోటి ధ‌నుష్ మారి 2. ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో ఎన్జీకే ఇప్ప‌టికే అయిపోయింది.. ఇక ఇప్పుడు మారి 2తో పాటు తెలుగులో ప‌డిప‌డి లేచే మ‌న‌సు కూడా ఒకేసారి పూర్తి చేస్తుంది సాయిప‌ల్ల‌వి. ఇదిలా ఉండ‌గా మారి 2లో సాయిప‌ల్ల‌వి లుక్ విడుద‌లైంది.

Sai Pallavi Maari 2 First Look Unveiled by Dhanush

దివాళి సంద‌ర్భంగా ఈ లుక్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అందులో ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. పైగా ఆటోడ్రైవ‌ర్ క్యారెక్ట‌ర్.. అందుకే ఖాకీలో ఉన్న ఫోటోను విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఆరుతి ఆనంది అంటూ ప‌క్కా మాస్ పేరుతో వ‌స్తుంది ఈ ముద్దుగుమ్మ‌. త‌మిళ‌నాట ఖచ్చితంగా సాయిప‌ల్ల‌వి మారి 2తో స్టార్ హీరోయిన్ అయిపోతాన‌ని న‌మ్మ‌కంతో ఉంది. అక్క‌డ న‌టించిన క‌ణం ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు ఈమె ఆశ‌ల‌న్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. మ‌రి చూడాలిక‌.. ఆటోరాణి పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి ఎలా చేసిందో..?

More Related Stories