English   

రూమర్స్ ఎందుకని కాజల్ కన్ఫార్మ్ చేసింది

Kajal Agarwal Official Statement on bharateeyudu 2
2018-11-08 09:10:49

చందమామ బ్యూటీ కాజల్ కన్ఫార్మ్ చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ రాణిగా పారిస్ పారిస్ సినిమాలో నటిస్తోన్న ఈ భామకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. అయితే ఈ విషయంలో కొన్ని రూమర్స్ వినిపించాయి. బట్ అవన్నీ కాదని.. ఫైనల్ గా ఓ డెసిషన్ తీసుకుంది. ఇటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తూ జూనియర్ భామలకు గట్టి పోటీనే ఇస్తోందీ సీనియర్ బ్యూటీ. తనకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ తేజతో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఓ సినిమా.. అలాగే శ్రీనివాస్ తోనే కొత్త దర్శకుడు తీస్తోన్న సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక అటు కోలీవుడ్ లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘క్వీన్’ రీమేక్ లో నటిస్తూ తనిప్పట్లో రిటైర్ కాను అనే ఇండికేషన్స్ స్ట్రాంగ్ గానే ఇస్తోంది.

ఇక ఈ నేపథ్యంలో అమ్మడికి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. అదే భారతీయడు -2 సినిమాలో. కమల్ హాసన్ సరసన ఛాన్స్ అంటే ఇప్పటికీ చాలామంది హీరోయిన్లు లక్కీగానే ఫీలవుతారు. అలాంటి లక్కీ ఛాన్స్ కాజల్ కు అడగకుండానే.. ఇంకా చెబితే ఊహించకుండానే వచ్చింది. యస్.. భారతీయుడు -2 లో తనకు ఆఫర్ ఇచ్చారు. మొదట్లో కాస్త ఆలోచించింది. దీంతో కాజల్ కు ఇష్టం లేదని చెప్పుకున్నారు. బట్.. తనే స్వయంగా ఆ విషయాన్ని డిక్లేర్ చేసింది. తను భారతీయుడు-2లో నటించబోతున్నట్టు చెప్పేసింది.

1995లో వచ్చిన భారతీయుడులో కమల్ హాసన్ చేసిన ద్విపాత్రాభినయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ సినిమా దేశవ్యాప్తంగానూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాంటి మూవీకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ వస్తోంది. ఫస్ట్ పార్ట్ లో హీరో కాలిపోతోన్న జీప్ నుంచి దూకిపారిపోతాడు. ఓ ఎస్టీడీ బూత్ కు వెళ్లి నేను భారతీయుడ్ని అంటూ ఓ కాల్ కూడా చేస్తాడు.  మరి ఈ సారి ఎలాంటి కథ, కథనాలతో వస్తారో కానీ.. మొత్తంగా చందమామకు లోకనాయకుడుతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది.

More Related Stories