English   

థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ టార్గెట్ ఎంత‌..? 

Aamir-Khan
2018-11-08 10:49:37

అమీర్ ఖాన్ సినిమా అంటే చాలు.. రికార్డుల‌కు తెర‌తీయొచ్చు అనే న‌మ్మ‌కం ఒక‌టి ఉంది. ఆయ‌న ఏం సినిమా చేసినా కూడా రికార్డులు మాత్రం న‌డుచుకుంటూ వ‌చ్చేస్తుంటాయి. ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ తో వ‌స్తున్నాడు ఈ హీరో. ఈ చిత్రం మ‌రికొద్ది గంట‌ల్లో విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్స్ కూడా ప‌డుతున్నాయి. ఇప్పుడు అమీర్ ముందున్న ల‌క్ష్యం ఒక్క‌టే.. 2000 కోట్లు. ఈ రికార్డు కోసం బాహుబ‌లి 2తో పాటు దంగ‌ల్ కూడా ప్ర‌య‌త్నించింది. అయితే ద‌గ్గ‌ర్లో ఆగిపోయాయి కానీ చేర‌లేదు. ఇప్పుడు అమీర్ తో పాటు ర‌జినీకాంత్ 2.0 కూడా రెండు వేల కోట్ల కోసం ఆశ ప‌డుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో ఎక్కువ‌గా థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ కు 2000 కాదు కానీ హిట్ కానీ అయ్యిందంటే క‌చ్చితంగా 1200 కోట్ల వ‌ర‌కు ఇండియాలోనే కొల్ల‌గొట్టే అవ‌కాశాలు లేక‌పోలేవు. పైగా ఈయ‌న‌కు చైనా మార్కెట్ కూడా ఉంది. అది కానీ క‌లిసింది అంటే సినిమా 2000 కోట్ల‌కు చేర‌డం ఖాయం. ఆయ‌న న‌టించిన దంగ‌ల్ 1200 కోట్లు చైనాలోనే వ‌సూలు చేసింది.. దానికితోడు ఆయ‌న అతిథి పాత్ర చేసిన సీక్రేట్ సూప‌ర్ స్టార్ కూడా చైనాలో 800 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్పుడు కానీ థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ కు టాక్ బాగా వ‌చ్చిందంటే ఈజీగా 2000 కోట్లు చేరుకోవ‌డం ఖాయం. న‌వంబ‌ర్ 8న విడుద‌లవుతుంది ఈ చిత్రం. ధూమ్ 3 ఫేమ్ విజ‌య్ కృష్ణ ఆచార్య దీనికి ద‌ర్శ‌కుడు. మ‌రి చూడాలి అమీర్ ఖాన్ ల‌క్ష్యం ఎలా ఉండ‌బోతుందో.. ఎంత ఉండ‌బోతుందో..? 

More Related Stories