English   

మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్న త‌రుణ్ భాస్క‌ర్..

Tharun-Bhascker
2018-11-08 12:46:05

ఈ త‌రం ద‌ర్శ‌కులు చాలా తెలివైన వాళ్లు. అందులో త‌రుణ్ భాస్క‌ర్ కూడా ఉన్నాడు. పెళ్లిచూపులుతో ప‌రిచ‌యం అయిన ఈ ద‌ర్శ‌కుడు ఈ మ‌ధ్యే ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ వ‌చ్చాడు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయింది. క‌మ‌ర్షియ‌ల్ గా సేఫ్ అని చెప్పుకుంటున్నా ప్రేక్ష‌కుల దృష్టిలో మాత్రం ఫ్లాపే. అయినా ఏదైనా సినిమా విడుద‌లైన‌పుడు ఎలా ఉంది అని ముందు అడుగుతారు.. ఆ త‌ర్వాత క‌థేంటి అని..? కానీ త‌రుణ్ భాస్క‌ర్ రెండో సినిమా ఈ న‌గ‌రానికి ఏమైందికి మాత్రం కేవ‌లం తొలి ప్ర‌శ్న మాత్ర‌మే అడ‌గాలి. ఎందుకంటే ఈ చిత్రంలో క‌థ లేదు.. కేవ‌లం కామెడీ మాత్ర‌మే ఉంది. పెళ్లిచూపులు సినిమాకు ప‌క‌డ్బంధీ క‌థ రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. తొలి సినిమా కాబ‌ట్టి ఎన్నో ఏళ్లుగా క‌ల‌లు కంటూ రాసుకున్న స్క్రిప్ట్ అది. 

అందుకే అందులో ఎమోష‌న్స్ సెంటిమెంట్ తో పాటు కామెడీ కూడా ఉంది. కానీ రెండో సినిమాకు వ‌చ్చేస‌రికి అవేవీ లేవు. ఉన్న‌ద‌ల్లా కామెడీ ఒక్క‌టే. ప్ర‌తీ సీన్ ఎలా న‌వ్వించాలి అని మాత్ర‌మే ఆలోచించాడు త‌రుణ్ భాస్క‌ర్. దానికితోడు తెలంగాణ యాస మ‌ళ్లీ పెట్టాడు. అయితే ఏం చేసినా కూడా ఈ న‌గ‌రానికి ఏమైంది బ‌త‌క‌లేదు. దాంతో త‌రుణ్ భాస్క‌ర్ మ‌ళ్లీ క‌నిపించ‌కుండా పోయాడు. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్ ల‌పై దృష్టి పెడుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటివి రావ‌డంతో వాటితో క‌లిసిపోయి ఏదైనా భారీ వెబ్ సిరీస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. త‌రుణ్ భాస్క‌ర్ కూడా ఇప్ప‌ట్లో సినిమా చేసేలా క‌నిపించ‌డం లేదు. మ‌రి చూడాలిక‌.. ఈ కుర్ర ద‌ర్శ‌కుడి నుంచి నెక్ట్స్ ఎలాంటి సినిమా రాబోతుందో..? 

More Related Stories