English   

అధికార పార్టీ కుట్ర.. మురుగదాస్ ఇంట్లో పోలీసులు

Sarkar Controversy Police Attempt to Arrest Director AR Murugadoss
2018-11-09 08:04:28

స‌ర్కార్ వివాదం రోజురోజుకీ మ‌రింత ముదురుతుంది కానీ త‌గ్గ‌డం లేదు. అలాగే క‌లెక్ష‌న్లు కూడా పెరుగుతున్నాయి. ఈ చిత్రం తీసినందుకు ఇప్పుడు మురుగ‌దాస్ పై కూడా క‌క్ష క‌డుతున్నారు రాజ‌కీయ నాయ‌కులు. ఇప్పుడు అర్ధ‌రాత్రి ఆయ‌న ఇంటికి పోలీసుల‌ను పంపారు అధికార పార్టీ. ఆయ‌న ఇంట్లో లేడు కాబ‌ట్టి స‌రిపోయింది కానీ లేదంటే పెద్ద ఇష్యూ అయిపోయేది. చెన్నైలో న‌వంబ‌ర్ 8 రాత్రి మురుగ‌దాస్ ఇంట్లో హై డ్రామా జ‌రిగింది. ఆయ‌న ఇంట్లో లేని స‌మ‌యంలో వ‌చ్చి పోలీసులు ర‌చ్చ చేసార‌ని.. ఆ త‌ర్వాత తాను ఇంట్లో లేను అని తెలిసిన త‌ర్వాత వెళ్లిపోయార‌ని చెప్పాడు మురుగ‌దాస్. స‌ర్కార్ సినిమాలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సీన్స్ ఉన్నాయంటూ.. అలాగే జ‌య‌ల‌లిత‌తో పాటు క‌రుణానిధికి సంబంధించిన వివాదాస్ప‌ద డైలాగులు కూడా ఉన్నాయంటూ వాటిని వెంట‌నే తీసేయాలంటూ ర‌చ్చ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే రెండు రోజుల్లోనే 100 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం.

ఇప్పుడు వ‌స్తున్న‌దంతా ఫ్రీ ప‌బ్లిసిటీ అని చిత్ర‌యూనిట్ కూడా చిత్రం చూస్తుంది కానీ నోరు మెద‌ప‌డం లేదు. ఇక ఇప్పుడు మురుగ‌దాస్ ఇంటికి పోలీసులు రావ‌డం వ‌ర‌కు ఇష్యూ వెళ్ల‌డంతో సినిమా పెద్ద‌లు కూడా క‌ల‌గ‌చేసుకున్నారు. న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు విశాల్ ట్వీట్ చేసాడు ఈ విష‌యంపై. డైరెక్టర్ మురుగదాస్ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒకసారి సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు అనుమతించి.. ప్రేక్షకులు కూడా సినిమాను చూసిన తర్వాత ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ రాసుకొచ్చాడు. ఇక ర‌జినీకాంత్ కూడా ఇదే చెప్పాడు. ఒక్క‌సారి సినిమా సెన్సార్ అయిపోయిన త‌ర్వాత అడ్డుకునే హ‌క్కు ఎవ‌రికీ లేదు. మురుగ‌దాస్ ఇంటికి పోలీసులు వెళ్ల‌డాన్ని ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేసాడు. మొత్తానికి అర్ధ‌రాత్రి హంగామాతో మురుగ‌దాస్ పేరు మార్మోగిపోతుందిప్పుడు.. అలాగే స‌ర్కార్ సినిమా కూడా.

More Related Stories