English   

నాని ప్ర‌శ్న.. త‌మ‌న్నా టైటిల్

Nani’s Next Yenti Song Title Tamannaah's Movie Title
2018-11-09 10:02:26

అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. నిజంగానే నాని ప్ర‌శ్న అడుగుతుంది త‌మ‌న్నా. అస‌లు వీళ్లిద్ద‌రికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? అప్పుడు నాని పాడిన పాట‌నే ఇప్పుడు త‌మ‌న్నా త‌న సినిమాకు టైటిల్ గా పెట్టేసుకుంది. ఈమె త‌ర్వాతి సినిమాకు నెక్ట్స్ ఏంటి అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఇదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఫ‌నా లాంటి సినిమా చేసిన కునాల్ కోహ్లీ ఇప్పుడు తెలుగులో త‌మ‌న్నా, సందీప్ కిష‌న్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మొద‌లై రెండేళ్లైంది.. ఇప్పుడు పూర్త‌యింది. దివాళి సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు. త్వ‌ర‌లోనే సినిమాను కూడా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అంటున్నారు.

అంతా లండ‌న్ లోనే షూటింగ్ జ‌రిగింది. ఇందులో న‌వ‌దీప్ కూడా న‌టించాడు. అస‌లు త‌మ‌న్నా ఏంటో.. సందీప్ కిష‌న్ లాంటి చిన్న హీరోతో న‌టించ‌డం ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు కానీ ఏం చేస్తాం టైమ్ అలా ఉంది మ‌రి. త‌న‌కు అస్స‌లు ఛాన్సులు లేని టైమ్ లో ఈ చిత్రం ఒప్పుకుంది త‌మ‌న్నా. కానీ ఇప్పుడు వెంక‌టేష్ తో ఎఫ్ 2.. చిరంజీవితో సైరా సినిమాలు చేస్తుంది. ఇక క్వీన్ తెలుగు రీమేక్ ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీలోనూ ఈమె హీరోయిన్. మొత్తానికి మ‌రి ఈ నెక్ట్స్ ఏంటి అనేది త‌మ‌న్నా ఎప్పుడు చెబుతుందో చూడాలిక‌.

More Related Stories