English   

వినయవిధేయ రాముడు కాదు పరశురాముడు 

Vinaya-Vidheya-Rama
2018-11-09 11:03:07

బోయపాటి శ్రీను.. దర్శకుడుగా అతనికి ఓ ముద్ర ఉంది. రొటీన్ అనే పేరు వచ్చినా సరే.. మాస్ ను ఊపేయడంలో అతని తర్వాతే ఎవరైనా అనుకునేలా చేస్తున్నాడు. హీరో ఎవరైనా సరే తన స్టైల్లోనే ఊరమాస్ గా ప్రెజెంట్ చేస్తాడు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలోనూ అదే జరిగింది. వినయవిధేయ రామ అనే సాఫ్ట్ టైటిల్ పెట్టినా.. టీజర్ తోనే ఓ రేంజ్ లో ఇది ఊరమాస్ అనిపించాడు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానా జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘వినయవిధేయ రామ’. టైటిల్ సాఫ్ట్ గా ఉంది కదా సినిమా కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నవాళ్లకు అలా ఏం ఉండదని మరోసారి ప్రూవ్ చేశాడు బోయపాటి శ్రీను. తనదైన శైలిలోనే టీజర్ లోనే ఓ రేంజ్ లో మాస్ మూవీ అని చెప్పేశాడు. సంక్రాంతి పండగ బరిలో నిలిచిన ఈ వినయవిధేయ రాముడు కూడా పరశురాముడులా పరాక్రమం చూపుతున్నాడు. ఇప్పటి వరకూ రామ్ చరణ్ చాలా మాస్ సినిమాలు చేశాడు. కానీ వాటికి మించి అనేలా ఉందీ టీజర్.

సాధారణ హీరోలతో కూడా అసాధారణమైన యాక్షన్ చేయించే బోయపాటి శ్రీనుకు రామ్ చరణ్ లాంటి హీరో దొరికితే ఊరుకుంటాడా..? అందుకే చరణ్ తో ‘అన్నాయ్ వీణ్ని చంపేయాలా, భయపెట్టాలా, భయపెట్టాలంటే పదినిమిషాలు.. చంపేయాలంటే పదిహేను నిమిషాలు’ వంటి డైలాగ్ చెప్పించాడు. ఇక టీజర్ ఫినిషింగ్ లో వచ్చే షాట్.. బోయపాటి టాలెంట్ కు నిదర్శనంగా కనిపిస్తోంది. అలాగే విలన్ వివేక్ ఓబెరాయ్ తో పాటు విలన్ గ్యాంగ్ ను కూడా స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మాస్ విందు కాబోతోందనేది మాత్రం అర్థమౌతోంది. 

More Related Stories