English   

బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త ‘కవచం’ చూశారా..?

Ballamkonda-Srinivas
2018-11-09 13:11:11

చాలా వేగంగా స్టార్ హీరో కావాలని కలలు కంటోన్న కుర్రాడు బెల్లంకొండ శ్రీనివాస్. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.. కానీ టైమ్ కలిసి రావడం లేదు. యాక్షన్ పార్ట్ లో ఎక్స్ పర్ట్ అనిపించుకుంటోన్నా పర్ఫార్మెన్స్ లో మాత్రం పూర్ గా ఉన్నాడు. అలాగే నాలుగు సినిమాలు చేసిన తర్వాత కూడా డైలాగ్ డెలివరీలో ఏ మాత్రం ఇంప్రూవ్ కాలేదు. అందువల్ల కొంత ఇబ్బంది పడుతున్నాడు. అయితే అతను సినిమాల పరంగా ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. వరుసగా సినిమాలు చేస్తూనే వెళుతున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వీటిలో రెండు సినిమాల్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం.
 
ఇక కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు ‘కవచం’ అనే టైటిల్ కన్ఫార్మ్ చేశారు. మరి ఈ కవచం ఏంటో కూడా ఫస్ట్ లుక్ లోనే చూపించారు. కుర్రాడు ఫస్ట్ టైమ్ పోలీస్ గా నటించాడు. పోలీస్ గా అతని లుక్, సినిమా ఫస్ట్ లుక్ రెండూ బావున్నాయి. ఇక విశేషం ఏంటంటే.. ఈ మూవీని డిసెంబర్ లోనే విడుదల చేస్తున్నట్టు కూడా చెప్పారు. ఇప్పటికే డిసెంబర్ చాలా టైట్ గా ఉంది. అయినా పోటీకి రెడీ అయ్యారంటే ఏ టైమ్ లో వస్తారా అనేది చూడాలి. 

ఇక తేజ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా వేగంగానే షూటింగ్ జరుపుకుంటోంది. ఇది కాక రీసెంట్ గా మరో కొత్త సినిమాకూ కమిట్ అయ్యాడు శ్రీనివాస్. ఏదేమైనా చాలా త్వరగా స్టార్ హీరో అవ్వాలన్న శ్రీనివాస్ కల నిజం కావాలని కోరుకుందాం.. 

More Related Stories