English   

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఓ దివాళి పూజ..

Chiranjeevi-Pawan
2018-11-09 14:46:44

ఎందుకో తెలియ‌దు కానీ ఈ మ‌ధ్య ఎక్కువ‌గా అన్న‌య్య‌తోనే క‌నిపిస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆ మ‌ధ్య కొన్నేళ్ల పాటు చిరంజీవితో కానీ.. మెగా కుటుంబంతో గానీ క‌నిపించ‌లేదు ప‌వ‌ర్ స్టార్. అన్న‌య్య కాంగ్రెస్ లో చేరిన త‌ర్వాత ప‌వ‌న్ కు ఇష్టం లేక దూరంగా ఉన్నాడు. ఈ విష‌యం చెప్పాడు కూడా. అయితే అదంతా రాజ‌కీయాల ప‌రంగానే.. ప‌ర్స‌న‌ల్ గా ఇప్ప‌టికీ అన్న‌య్యే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు దేవుడు. అవ‌స‌రం అనుకున్న‌పుడు వ‌చ్చి అన్న ఆశీస్సులు తీసుకుని వెళ్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ప‌వ‌ర్ స్టార్. చిరంజీవి ఇంట్లో జ‌రిగిన పూజ‌కు ప‌వ‌న్ వ‌చ్చాడు. పంచెక‌ట్టుతో అదుర్స్ అనిపించారు అన్నాద‌మ్ములు. చిరంజీవితో ప‌వ‌న్ కు రిలేషన్ కూడా మున‌ప‌టిలా లేద‌ని చెబుతుంటారు కొంద‌రు. ఇక చ‌ర‌ణ్ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు దూరంగా ఉంటున్నాడ‌ని.. బాబాయ్ అంటే ప్రేమ ఉన్నా కూడా దూరంగానే ఉంటున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. 

అయితే ఎవ‌రు ఎన్ని అన్నా కూడా మెగా కుటుంబం మాత్రం ఎప్పుడూ ఒక్క‌టే. రాజ‌కీయాల్లో చిరు చేసిన కొన్ని ప‌నులు మాత్రం ప‌వ‌న్ ను డిస్ట‌ర్బ్ చేసిన మాట వాస్త‌వం. అది కాకుండా ప‌ర్స‌న‌ల్ గా మాత్రం చిరు అంటే ప‌వ‌న్ కు ఎన‌లేని గౌర‌వం. ఇప్ప‌టికీ అదే చూపిస్తుంటాడు ప‌వ‌ర్ స్టార్. అన్న‌య్య‌పై ఈగ వాలినా త‌ట్టుకోలేదు. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ కూడా అన్న‌య్య మంచివాడు.. చిరంజీవి అంత మంచివాన్ని తాను కాద‌ని చెప్తాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అంటే అక్క‌డ కూడా అన్న‌య్య‌నే వెన‌కేసుకుని వ‌స్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇక ఇప్పుడు చిరు ఇంట్లో జ‌రిగిన పూజ‌కు వ‌చ్చి అన్నావ‌దిన‌ల ఆశీర్వాదం తీసుకుని వెళ్లాడు ప‌వ‌ర్ స్టార్. జ‌న‌సేన ప‌నుల్లో బిజీగా ఉండి కూడా అన్న‌య్య పిల‌వ‌గానే వాలిపోయాడు మెగా బ్ర‌ద‌ర్. అది వీళ్ల మ‌ధ్య ఉన్న రిలేష‌న్. 

More Related Stories