English   

అమీర్ కూడా ఇలా చేయ‌డం ఏంటి..? 

Aamir-Khan
2018-11-09 15:27:36

ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ చూసిన త‌ర్వాత అభిమానులు అంతా ఇదే అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని కేవ‌లం అమీర్ ఖాన్ అనే బ్రాండ్ చూసి వెళ్ళారు థియేట‌ర్స్ కు ప్రేక్ష‌కులు.. అభిమానులు. అయితే థియేట‌ర్ లోకి వెళ్లిన త‌ర్వాత ఊహించ‌ని షాక్ ఇచ్చాడు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్. త‌న ప‌ర్ఫెక్ష‌న్ మొత్తం సినిమాలో క‌నిపించే స‌ముద్రంలోనే క‌లిపేసాడు ఈ హీరో. ప‌దేళ్ళ త‌ర్వాత ఆయ‌న నుంచి మ‌ళ్లీ ఓ చెత్త సినిమా వ‌చ్చింది. మంగ‌ళ్ పాండే త‌ర్వాత అమీర్ జోరుకు తిరుగులేదు. మ‌ధ్య‌లో త‌లాష్ లాంటి సినిమాలు పోయినా కూడా చెత్త సినిమా అనే పేరు అయితే తీసుకురాలేదు కానీ ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ మాత్రం అది చేసేలా క‌నిపిస్తుంది. 13 ఏళ్ళ‌ త‌ర్వాత ఆయ‌న నుంచి అస‌లైన పిచ్చి సినిమా ఒక‌టి వ‌చ్చిందని అభిమానులు కూడా ఒప్పుకుంటున్నారు. కేవ‌లం విజువ‌ల్ తోనే న‌డిపించాల‌నే భ్ర‌మ‌లో విష‌యాన్ని గాలికి వ‌దిలేసాడు ద‌ర్శ‌కుడు విజ‌య్ కృష్ణ‌. ఇక అమీర్ ఖాన్ కూడా త‌న బ్రాండ్ పై ఉన్న ఓవ‌ర్ కాన్ఫిడెన్సో ఏమో కానీ మొత్తానికి ప‌క్క‌కెళ్లిపోయాడు. పీకే, దంగ‌ల్ లాంటి క‌థ‌ల‌ను ఎంచుకున్న అమీర్ ఖానేనా ఇప్పుడు ఇలాంటి క‌థ‌ను తీసుకున్నాడు అంటూ ప్ర‌శ్నిస్తుంటే ఆయ‌న కూడా స‌మాధానం చెప్పుకోలేని స్టేజ్ కు వెళ్ళిపోయేలా చేసింది ఈ చిత్రం. మొత్తానికి చాలా ఏళ్ళ త‌ర్వాత అమీర్ ఖాన్ కూడా ఓ చెత్త సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. తాను మామూలు హీరోనే అని నిరూపించుకున్నాడు. 

More Related Stories