English   

య‌శ్ కేజియఫ్ ట్రైల‌ర్.. అంతా మాఫియానే..!

KGF-Trailer
2018-11-09 17:53:37

య‌శ్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అస్స‌లు ప‌రిచ‌యం లేదు. క‌న్న‌డ‌లో స్టార్ హీరో ఈయ‌న‌. వ‌ర‌స విజ‌యాల‌తో అక్క‌డ దున్నేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు ఈయ‌న తెలుగు ఇండ‌స్ట్రీపై కూడా దృష్టి పెట్టాడు. అందుకే మాఫియాను వెంట బెట్టుకుని వ‌స్తున్నాడు. ఈయ‌న ఇప్పుడు న‌టిస్తున్న సినిమా కేజియఫ్. క‌న్న‌డ‌లో హైయ్య‌స్ట్  బ‌డ్జెట్ సినిమా ఇది. దాదాపు 50 కోట్ల‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. మాఫియా డాన్ తంగం బ‌యోపిక్ గా ఈ చిత్రం వ‌స్తుంది. ఇప్పుడు ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. 1951లో మొద‌ల‌య్యే క‌థ ఇది. అక్క‌డ్నుంచి తంగం ఎలా ఎదిగాడు.. డాన్ ఎలా అయ్యాడు అనేది క‌థ‌. ముఖ్యంగా మైనింగ్ మాఫియాపై జ‌రుగుతున్న క‌థ‌లా క‌నిపిస్తుంది ట్రైల‌ర్ చూస్తుంటే. అయితే మాఫియా క‌థ‌లు ఇప్ప‌టికే ఎన్నో చూసాం కాబ‌ట్టి పెద్ద‌గా ఆస‌క్తి అనిపించ‌లేదు కానీ విష‌యం మాత్రం బాగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. 

అయితే అది ఎంత‌వ‌ర‌కు మ‌న ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంద‌నేది చూడాలి. కైకాల స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నాడు. ఈ సినిమాలో త‌మ‌న్నా ఐటం సాంగ్ చేయ‌డం విశేషం. మాఫియాకు బాగానే క‌నెక్ట్ అయిపోయింది మిల్కీబ్యూటీ. ఈ సినిమాలో ఐటం సాంగ్ కోసం ఏకంగా 75 ల‌క్ష‌లు తీసుకుంటుంది త‌మ‌న్నా. అక్క‌డ నిజానికి ఏ స్టార్ హీరోయిన్ కూడా అంత మొత్తం తీసుకోదు. అంతెందుకు ఇదే సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్న శ్రీ‌నిధి శెట్టికి కూడా అంత ఇచ్చుండ‌రు. కానీ ఒకేఒక్క పాట కోసం త‌మ‌న్నా ఏకంగా 75 ల‌క్ష‌లు తీసుకుంటుంది. ఎంతైనా మాఫియా బ్యాక్ డ్రాప్ క‌దా.. నిల‌బెట్టి మ‌రీ వ‌సూలు చేస్తుంది. త‌మ్మూ ఐటం సాంగ్ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్. డిసెంబ‌ర్ 21న కేజియ‌ఫ్ విడుద‌ల కానుంది. మొత్తానికి తెలుగులో ఈ చిత్రంతో గుర్తింపు తెచ్చుకోవాల‌ని చూస్తున్నాడు య‌శ్. అది ఎంత‌వ‌ర‌కు నెర‌వేరుతుందో చూడాలి. 

More Related Stories