English   

విజయ్ దేవరకొండకు ఇది టెస్టింగ్ టైమ్ 

Vijay-Devarakonda
2018-11-09 18:46:25

అతి తక్కువ టైమ్ లోనే పెద్ద స్టార్ గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. అయితే స్టార్డమ్ వచ్చినంత ఈజీ కాదు దాన్ని నిలబెట్టుకోవడం. మూడు హిట్స్ తో స్టార్ గా మారిన అతను ఇప్పటికే ఓ ఫ్లాప్ చూసి ఇబ్బంది పడ్డాడు. ఈ నెల 17న టాక్సీవాలా విడుదల కాబోతోంది. సో.. ఈ మూవీ కూడా ఖచ్చితంగా విజయం సాధించాలి. లేదంటే నోటా టు టాక్సీవాలా అంటూ విజయ్ దేవరకొండ స్టామినాపై కొత్త కామెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది.
 
కలిసొచ్చే కథలు వస్తే.. నడిచొచ్చే హీరోలు పుడతారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అనే స్టార్ రైజింగ్ కూడా అలాగే జరిగింది. వరుసగా మూడు విజయాలు సాధించడమే కాదు.. థర్డ్ మూవీతోనే వంద కోట్ల క్లబ్ లో చేరాడు. దీంతో చిరంజీవి వంటి స్టార్స్ కూడా విజయ్ ని స్టార్ హీరో అనేశారు. కానీ ఆ పొగడ్తల సౌండ్ కూడా తగ్గకుండానే మనోడు నోటా అంటూ భారీ డిజాస్టర్ చూశాడు. ఇక ఇప్పుడు టాక్సీవాలాగా రాబోతున్నాడు.ఈ నెల 17న విడుదల కాబోతోన్న టాక్సీవాలాపై మంచి అంచనాలే ఉన్నాయి. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో వస్తోన్న సినిమా ఇది. కానీ రిలీజ్ విషయంలో చాలా లేట్ కావడం ఈ సినిమాకు పెద్ద మైనస్.

విజయ్ దేవరకొండ స్టామినాను ప్రూవ్ చేసేది ఖచ్చితంగా టాక్సీవాలా సక్సెస్సే.  ఈ మూవీ ఏ మాత్రం తేడా కొట్టినా మనోడికి ఇబ్బందులు తప్పవు. కాకపోతే టాక్సీవాలా ట్రైలర్స్, సాంగ్స్ చూస్తోంటే కాస్త ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది. కానీ ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి.. చాలా బావుంటేనే సడెన్ గా ఆడియన్ కు నచ్చుతుంది. ఏమాత్రం తేడా కొట్టినా ఇన్ స్టంట్ గా రిజెక్ట్ చేస్తారు. అది కూడా ఈ సినిమాకు ఇబ్బందికరమైన సిట్యుయేషనే. ఇక ది ఎండ్ అనే హారర్ సినిమా తీసిన రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రియాంక ఝవాల్కర్ అనే తెలుగు భామ హీరోయిన్ గా నటించింది. మొత్తంగా నోటా మాట రిపీట్ కాకుండా ఉండాలంటే టాక్సీవాలా టాప్ గేర్ లో ఆడియన్ ను చేరాల్సి ఉంటుంది. 

More Related Stories