English   

సినిమాలు లేక‌పోయినా న‌ష్టం లేదంటున్న శృతిహాస‌న్.. 

Shruti-Haasan
2018-11-09 19:25:05

శృతిహాస‌న్ ను ఇప్పుడు ఇంక న‌టిగా చూడాల్సిన ప‌నిలేదు. 30 ఏళ్ల‌కే న‌ట‌న‌కు గుడ్ బై చెప్పాల‌ని చూస్తుంది ఈ భామ‌. ఇప్ప‌టికీ ఈమె స్టార్ హీరోయినే కానీ న‌ట‌న‌పై ఆస‌క్తి లేని స్టార్ హీరోయిన్. ఏడాదిగా ఏ సినిమా ఒప్పుకోవ‌డం లేదు శృతిహాస‌న్. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ఏదో చిన్న సినిమా ఒక‌టి చేస్తుంది. అది త‌ప్ప మ‌రో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. శృతి ఖాళీగా ఉండ‌టం వెన‌క మ‌రో క‌థ కూడా వినిపిస్తుంది. ఈ భామకు ఇప్పుడు న‌ట‌న‌ను మించిన ఆలోచ‌న‌లు ఉన్నాయి. పైగా లావుగా మారి.. మున‌ప‌టి గ్లామ‌ర్ క‌నిపించ‌ట్లేదు. శృతిహాస‌న్ కు పెళ్లిపోయిందా అనే అనుమానం ఇండ‌స్ట్రీతో పాటు అభిమానుల‌కు కూడా క‌లుగుతుంది. ఒక‌ప్పుడు స‌న్న‌గా మెర‌పుతీగ‌లా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా షేప్ అవుట్ అయిపోయింది. 

ఫిజిక్ మీద దృష్టి పెట్ట‌డ‌మే మానేసింది. కాట‌మ‌రాయుడులో శృతి అప్పియ‌రెన్స్ పై చాలా విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ‌పై మ‌రో వార్త కూడా హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదే శృతిహాసన్ పెళ్లి. అవును.. ఈ భామ‌కు పెళ్లైపోయింద‌నే వార్త‌లు బ‌లంగానే వినిపిస్తున్నాయి. లండ‌న్ లో ఈమెకు ఓ ప్రియుడు ఉన్నాడు. అత‌డితోనే డేటింగ్ చేస్తుంది శృతి. పైగా ఈ మ‌ధ్య మాట్లాడితే లండ‌న్ వెళ్తోంది శృతిహాస‌న్. అక్క‌డే వీళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టేసార‌ని తెలుస్తోంది. దీనికి క‌మ‌ల్ నుంచి పూర్తి మ‌ద్ద‌తు ఉంది. దీనిపై శృతిహాస‌న్ మాత్రం ఏం చెప్ప‌ట్లేదు. త‌న పెళ్లి త‌న ఇష్టం అని.. అది త‌న‌కు కావాల్సిన‌పుడు చేసుకుంటాన‌ని చెబుతుంది. 

ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఇలా ఉంటే.. ప్రొఫెష‌న‌ల్ గా మాత్రం శృతిహాస‌న్ మ‌రో ప్లాన్స్ వేసుకుంటుంది. ఈమె ఇక సినిమాలు మానేసి హాయిగా త‌న‌కు ఇష్ట‌మైన సంగీతంతో ప్ర‌యాణం చేయ‌బోతుంది. సినిమాల్లోకి రాక‌ముందే ఈమెకు సంగీతంపై ప‌ట్టుంది. అస‌లు త‌ను అనుకోకుండా న‌టి అయ్యాన‌ని త‌న దృష్టంతా సంగీతంపైనే ఉంద‌ని చెప్పింది శృతిహాస‌న్. ఈనాడు లాంటి సినిమాల‌కు మ్యూజిక్ కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు ప్రైవేట్ ఆల్బ‌మ్స్ చేయాల‌ని చూస్తుంది శృతి. దానికోస‌మే కాన్సెప్ట్ సిద్ధం చేసుకుంటుంది. ఇప్ప‌టికే టీంతో క‌లిసి ప్రాక్టీస్ కూడా చేస్తుంది. ఈ ఆల్బ‌మ్స్ స‌క్సెస్ అయితే సినిమాల‌కు పూర్తిగా గుడ్ బై చెప్పి రాక్ స్టార్ గా సెటిలైపోవాల‌ని చూస్తుంది. అందుకే కొత్త వాటికి ఓకే చెప్ప‌డం లేదు.

More Related Stories