English   

కుర్రాడికి ఈ మూవీ ‘నోటా’ కాదుకదా

Karthikeya-Hippie
2018-11-09 20:02:33

తెలుగులో సూపర్ హిట్స్ కొట్టి ఓవర్ నైట్ క్రేజీ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ మార్కెట్ ఒక్కసారిగా విస్తరించింది. అందుకే చాలా తక్కువ టైమ్ లోనే ఏ స్టార్ హీరోకూ లేని స్థాయిలో తమిళనాడులోనూ అభిమానులు ఏర్పడ్డారు. అదంతా అర్జున్ రెడ్డి పుణ్యమే. అంతే కాదు.. అతని క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అక్కడి టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకడైన జ్ఞానవేల్ రాజా.. ఏకంగా అతనితో తమిళ్ సినిమా తీశాడు. ‘నోటా’గా వచ్చిన ఈ మూవీ విజయ్ దేవరకొండ విజయానందాలను ఒక్కసారిగా ఆవిరి చేసింది. నోటా డిజాస్టర్ కావడంతో అతనూ షాక్ అయ్యాడు. ఇప్పుడు ఇదే బాటలో ఆర్ఎక్స్ 100 కుర్రాడు కార్తికేయ కూడా వెళుతున్నాడు. అతన్ని కూడా ఓ తమిళ నిర్మాతే తీసుకువెళుతున్నాడు.

ఆర్ఎక్స్ 100 తో ఓవర్ నైట్ క్రేజీ గయ్ గా మారిన కుర్రాడు కార్తికేయ. అతని కోసం చాలామంది నిర్మాతలు కర్చీఫ్ లు వేశారు. కానీ మనోడు ముందుగా ఓ తమిళ నిర్మాతకు కమిట్ అయ్యాడు. చాలాపెద్ద స్టార్స్ తో సినిమాలు తీసిన కలైపులి ఎస్ థాను నిర్మాణంలో ఓ సినిమా మొదలుపెట్టాడు కార్తికేయ. హిప్పీ పేరుతో రూపొందుతోన్న ఈ మూవీకి దర్శకుడు కూడా తమిళ్ వ్యక్తే. పేరు టిఎన్ కృష్ణ. విజయ్ దేవరకొండ నోటాకూ తమిళుడే దర్శకుడు. మొత్తంగా హిప్పీ కూడా రెండు భాషల్లో విడుదల కాబోతోంది. మరి కుర్రాడు ఆవేశపడ్డాడో లేక నిజంగానే హిప్పీలో కంటెంట్ ఉందో కానీ.. ఇది కూడా నోటా లా మారితే అసలే ఒకే విజయం ఉన్నవాడు కదా.. మొత్తానికే దెబ్బయిపోతాడు. మరి హిప్పీ కార్తికేయను ఏం చేస్తుందో చూడాలి. 

More Related Stories