English   

చ‌ర‌ణ్ డైలాగ్ కు ప‌డిపోయిన ఉపాస‌న‌

Upasana Konidela Love The Dialogues of Charan’s Vinaya Vidheya Rama Teaser
2018-11-09 21:59:23

టాలీవుడ్ లో ఉన్న ల‌వ్లీ క‌పుల్స్ లో రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న కూడా ఉన్నారు. ఈ ఇద్ద‌రూ ఎప్పుడూ హాయిగా సంతోషంగా ఉంటారు. బ‌య‌టికి కూడా బెస్ట్ క‌పుల్ గా ఆద‌ర్శంగా ఉంటారు. ఇక ఉప్సీ కూడా చ‌ర‌ణ్ సినిమాల‌తో పాటు బిజినెస్ లు కూడా చూసుకుంటుంది. ఇప్పుడు కూడా రామ్ చ‌ర‌ణ్ కొత్త సినిమా విన‌య విధేయ రామ టీజ‌ర్ చూసి ట్విట్ట‌ర్లో సూప‌ర్ రియాక్ష‌న్ ఇచ్చింది. ఐ ల‌వ్ ల‌వ్ ల‌వ్ ది డైలాగ్ అంటూ రాసుకొచ్చింది ఈ మెగా కోడ‌లు. ఇందులో చ‌ర‌ణ్ చెప్పిన డైలాగ్ ఇప్ప‌టికే చాలా పాపుల‌ర్ అయింది. రేయ్ పండ్యం ప‌రుశురామ్ అయితే ఏంట్రా ఇక్క‌డ రామ్.. రామ్ కొణిదెల అంటూ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. అప్ప‌ట్లో చిరంజీవి ప‌రుశురాం.. ఎస్పీ ప‌రుశురాం అని చెప్పిన స్టైల్ గుర్తొచ్చింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా నువ్వు నంద అయితే నేను బ‌ద్రీ బ‌ద్రినాధ్ అంటూ మ‌రో డైలాగ్ వేసాడు. ఇప్పుడు అబ్బాయి కూడా అదే దారిలో రామ్.. రామ్ కొణిదెల అంటూ రెచ్చిపోయాడు. బోయ‌పాటి టీజ‌ర్ అంతా అణువ‌ణువు యాక్ష‌న్ నింపేసాడు. చ‌ర‌ణ్ లో ఉన్న మాస్ కోణాల‌న్నింటినీ వాడి పారేసాడు బోయ‌పాటి శీను. చ‌ర‌ణ్ టీజ‌ర్ పై ఉపాస‌న ఇచ్చిన రియాక్ష‌న్ ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది.

More Related Stories