English   

అల్లు అర్జున్ విజయ్ దేవరకొండను కాపాడగలడా..?

Allu Arjun Starts Promoting Vijay Devarakonda’s Taxiwaala Movie
2018-11-10 07:40:15

మూడు నెల‌లుగా విడుద‌ల కాకుండా బాక్సుల్లోనే ఉన్న టాక్సీవాలా మ‌రో వారం రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రంపై అంచ‌నాలు కానీ.. ఆస‌క్తి కానీ ఏమీ పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో అయినా కూడా ఎందుకో తెలియ‌దు టాక్సీవాలాపై ముందు నుంచే అంచ‌నాలు లేవు. ఇది సినిమాకు ప్ల‌స్ కూడా. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌స్తే పోయినా పెద్ద‌గా స‌మ‌స్య‌లు లేవు.. కానీ కొడితే మాత్రం బంప‌ర్ ఆఫ‌రే. రాహుల్ సంక్రీత్య‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఇక ఇప్పుడు ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ కోసం బ‌న్నీని తీసుకొస్తున్నారు. విజ‌య్ కు పెరిగిన ఇమేజ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా క‌థ‌ను కాస్త మార్చేసి మ‌ళ్లీ రీ షూట్లు కూడా చేసారు. ఇక ఇప్పుడు విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో మ‌నోడు ప్ర‌మోష‌న్స్ తోనే కాలం గ‌డిపేస్తున్నాడు.

గీత‌గోవిందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ను తీసుకొచ్చారు.. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్. దాంతో ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. పైగా గీతాఆర్ట్స్ లోనే సినిమా కావ‌డంతో బ‌న్నీ కూడా వ‌స్తున్నాడు. త‌న వంతు ప్ర‌మోష‌న్ చేస్తున్నాడు. గీతాఆర్ట్స్ తో పాటు యువీ క్రియేష‌న్స్ కూడా ట్యాక్సీవాలా నిర్మాత‌ల లిస్ట్ లో ఉన్నారు. నోటా ఫ్లాప్ త‌ర్వాత డీలా ప‌డిన విజ‌య్ కు ఇప్పుడు కానీ విజ‌య్ కు ఫ్లాప్ వ‌స్తే ప‌డిన‌ క‌ష్టం అంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైపోతుంది. అందుకే లేటైనా లేటెస్ట్ గా రావాల‌ని చూస్తున్నాడు ఈ కుర్ర హీరో. బ‌న్నీ రాక‌తో ఖచ్చితంగా సినిమాపై ఆస‌క్తి పెరుగుతుంద‌ని న‌మ్ముతున్నారు యూనిట్. న‌వంబ‌ర్ 11న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌బోతుంది. ఇక ప్ర‌మోష‌న‌ల్ వీడియోలు కూడా బాగానే విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సెన్సార్ టాక్ కూడా ప‌ర్లేదు.. దాంతో ఎలాగైనా టాక్సీవాలాను గ‌ట్టెక్కించాల‌నే గ‌ట్టి ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

More Related Stories