English   

సౌత్ షైన్ అవుతుంటే బాలీవుడ్ డల్ అవుతుంది

South Film Industry Shining But Bollywood Choosing Poor Content
2018-11-10 04:03:25

కొన్నాళ్ల క్రితం వరకూ బాలీవుడ్ వారికి సౌత్ సినిమా అంటే చిన్న చూపు. ఇక్కడివారివి చీప్ సినిమాలనే దృష్టి వారికి బాగా ఉండేది. ఇందుకు స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. అందరూ అలాగే అనుకునేవారు. దాదాపు దశాబ్ధం నుంచి బాలీవుడ్ లో సరైన సినిమాలే రావడం లేదు. వచ్చినా యేడాదికి ఒకటో రెండో. మిగతా అన్నీ మూస సినిమాలు. రొటీన్ లవ్ స్టోరీస్. కరణ్ జోహార్ మార్క్ ఓవర్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాస్. దీంతో అక్కడి ప్రేక్షకులకు వారి సినిమాపై బోర్ కొట్టింది. ఈ టైమ్ లో సౌత్ లో కంటెంట్ ఉన్న సినిమాలు పెరిగాయి. తెలుగులో తక్కువేఅయిన మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈగ వంటి సినిమాలు ఎంటైర్ కంట్రీని ఎట్రాక్ట్ చేశాయి. అంతకు ముందే రోబోతో శంకర్ దేశాన్ని షేక్ చేశాడు. ఇలా మెల్లగా సౌత్ సినిమాలే నార్త్ లో రీమేక్ కావడం మొదలైంది. కట్ చేస్తే వారికి మన సినిమాలే విజయాల్నివ్వడం ప్రారంభం అయింది. దీంతో ఇక అక్కడి ప్రేక్షకులు కూడా మన సినిమాలను డబ్బింగ్ లుగానూ విపరీతంగా చూడ్డం మొదలెట్టారు. ఈ దెబ్బకు షారుఖ్ ఖాన్ వంటి వాడు కూడా చెన్నై ఎక్స్ ప్రెస్ ఎక్కక తప్పింది కాదు. మొత్తంగా ఇప్పుడు వాల్ద్ వైడ్ బాలీవుడ్ సినిమాలకు అంత సీన్ లేదు. సౌత్ సినిమాలే ఓవర్శీస్ మార్కెట్ లోనూ సత్తాచాటుతున్నాయి. బాహుబలి తర్వాత బాలీవుడ్ రేంజ్ ఓ ప్రాంతీయ భాషా చిత్రాల స్థాయికి పడిపోయిందనేది నిజం. లేటెస్ట్ గా వచ్చిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఏదో మ్యాజిక్ చేస్తుందనుకుంటే ఫస్ట్ షోకే బిచాణా ఎత్తేసిందా సినిమా. ఇక మనకు మాత్రం త్వరలోనే శంకర్ డైరెక్షన్ లో వస్తోన్న ‘2.0’ త్వరలోనే వస్తోంది.

అటు పులిమురుగన్, టేకాఫ్, కాయంకులమ్ కొచ్చున్ని వంటి సినిమాలతో మళయాల చిత్రసీమ కూడా సత్తా చాటుతోంది. కాకపోతే ఇన్నాళ్లూ ఈ విషయంలో కన్నడ మేకర్స్ బాగా వెనకబడి ఉన్నారు. బట్ లేటెస్ట్ గా అక్కడి నుంచి కూడా ‘కెజిఎఫ్’ వస్తోంది. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా మెస్మరైజ్ చేస్తోంది. దాదాపు మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతోంది. కెజిఎఫ్ అంటే ‘కోల్ గోల్డ్ ఫ్రెండ్స్’ అనిఅర్థం. గోల్డ్ మైన్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మనకు పూర్తిగా కొత్తది. ఆ రకంగా మంచ కంటెంట్ తో పాటు అద్భుతమైన మేకింగ్ తోనూ శాండల్ వుడ్ సత్తా చాటబోతోంది.

సో.. సౌత్ సినిమా కంటెంట్ పరంగానే కాక.. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లోకి వెళుతోంది. అటు బాలీవుడ్ తగ్గిపోతోంది. దీంతో ఇప్పుడు నార్త్ లోనూ సౌత్ సినిమాల మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. మొత్తంగా ఒకప్పుడు ఛీ అన్నవాళ్లే ఇప్పుడు సూపర్బ్ అంటూ సౌత్ సినిమాలను టివిలకు అద్దుకుంటున్నారు.

More Related Stories