English   

విజయ్ దేవరకొండకు వార్నింగ్ బెల్

Vijay-Deverakonda
2018-11-10 14:05:03

విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిన హీరో. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగాడనే పేరు కూడా బలంగా ఉంది. దీంతో చాలా తక్కువ టైమ్ లోనే భారీ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పాటైంది. ఇక మనోడి యాటిట్యూడ్ కూడా చాలామందికి నచ్చుతుంది. స్టార్ అనే అహం ఇప్పటి వరకైతే చూపించలేదు. ఇక అర్జున్ రెడ్డితో కొంత వరకూ లేడీ ఫ్యాన్స్ కు నచ్చికపోయినా.. గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అట్రాక్ట్ చేశాడు. మొత్తంగా మూడో సినిమాతోనే వంద కోట్లు సాధించిన విజయ్ కి అనూహ్యంగా కోలీవుడ్ ఎంట్రీ దక్కింది. కోలీవుడ్ ఎంట్రీపై ఎంతో క్యూరియాసిటీ చూపించిన విజయ్ కి నోటా గట్టి షాక్ ఇచ్చింది. తమిళ్ కంటే కూడా తెలుగులో భారీ డిజాస్టర్ గా నిలిచిందీ చిత్రం. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 

ఇక ఇప్పుడు గీతగోవిందం కంటే ముందే వస్తుందనుకున్న టాక్సీవాలాతో రాబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథగా వస్తోన్న ఈ మూవీపై చాలా ఆశలున్నాయి. కానీ బాగా లేట్ కావడంతో ఆడియన్స్  లో ఆసక్తి తగ్గిందనేది నిజం. మరోవైపు ఈ మూవీ అవుట్ పుట్ నచ్చకే మనోడు అప్పట్లో గీత గోవిందంకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడనే కమెంట్స్ కూడా ఉన్నాయి. మరి అలాంటి సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా అనుమానాలుంటాయి. కానీ అన్నిసార్లూ అనుమానాలేనిజం కావు కదా. అందుకే ఒకవేళ హిట్ అయినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ హిట్ కాకపోతే విజయ్ దేవరకొండకు ఇది డేంజర్ బెల్ లాంటిదే. ఇప్పటికే చాలా త్వరగా ఎదిగాడని అతనిపై కొందరు అక్కసుతో ఉన్నారు. ఇప్పుడు వరుసగా రెండు ఫ్లాపులు వచ్చాయంటే కొత్త ప్రాపగాండా కూడా మొదలుపెడతారు. అవి తప్పించుకోవాలంటే టాక్సీవాలా టాప్ గేర్ లో వెళ్లి మరి హిట్ కొట్టాలి.. లేదంటే విమర్శకులు కూడా రెడీగా ఉణ్నారు. 

More Related Stories