English   

శ్రుతి హాసన్ కెరీర్ కు ప్యాకప్ చెప్పేసిందా..?

Shruti-Haasan
2018-11-10 15:44:15

కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన అందమైన ప్రతిభతో ఆకట్టుకున్న బ్యూటీ శ్రుతి హాసన్. తండ్రిముద్రను చెరిపేసి తనకంటూ ఓ స్టాంప్ వేసుకుంది. స్టార్ హీరో కూతురైనా ఎక్స్ పోజింగ్ విషయంలోనూ ఏ మాత్రం తగ్గలేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేసిన శ్రుతి హాసన్ ఒక దశలో ఇక్కడ టాప్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కమల్ లాగే తను కూడా మల్టీటాలెంటెడ్.. మంచి సింగర్ కూడా. మధ్యలో ఏమైందో కానీ తను సడెన్ గా బ్యాక్ అయింది. ఆఫర్స్ వస్తున్నా తనే వదులుకుంది. ఓ విదేశీయడుతో ప్రేమలో పడిందనే వార్తలు చాలాకాలంగా వస్తున్నవే. వాటి గురించి అడిగితే మాత్రం ‘మీకెందుకు’అంటుంది. ఆ బాయ్ ఫ్రెండ్ తో కలిసి తండ్రి సరసన కూర్చుని ఎన్నో ఫంక్షన్స్ లోనూ కనిపించింది. మొత్తంగా గత కొన్నాళ్లుగా వెండితెరకు కావాలనే దూరంగా ఉంటోన్న శ్రుతిహాసన్ త్వరలోనే ఓ టివి షోకు హోస్ట్ గా వ్యవహరించబోతోంది. 

తమిళ్ లో ‘వైవ్ హలో సాగో’ అనే కార్యక్రమానికి శ్రుతి హోస్ట్ గా ఉండబోతోంది. ఈ నెల 28 నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది. మొత్తం 13 వారాల పాటు సాగుతుందట ఈ ఎపిసోడ్.  ప్రతి ఆదివారం రాత్రి 8.30 గంటలకు ప్రసారం అవుతుందని చెబుతున్నారు. ఈ షో హిట్ అయితే గనక ఇక తను బుల్లితెరకే పరిమితం అవుతుంది. అలాగే సినిమాల విషయంలో తను పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేదని కూడా వినిపిస్తోంది. సో.. వ్యవహారం చూస్తోంటే.. ఇక శ్రుతి హాసన్ సినిమా కెరీర్ కు ప్యాకప్ చెప్పినట్టే అనుకోవాలేమో. 

More Related Stories