English   

శంకర్ సినిమాలో మహానటి భర్త 

Dulquer-Salmaan
2018-11-10 10:13:06

మహానటితో మనవాళ్లను బాగా ఆకట్టుకున్న స్టార్ దుల్కర్ సాల్మన్. కుర్రాడు మంచి హ్యాండ్సమ్. మళయాలంలో తండ్రి మమ్మూట్టి తర్వాత ఆ స్థాయికి వెళ్లగల ప్రతిభావంతుడు కూడా. ఇప్పటికే యంగ్ స్టర్స్ లో మెగాస్టార్ గా వెలుగుతోన్న దుల్కర్ కు లేటెస్ట్ గా ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. అది కూడా దర్శకుడు శంకర్ నుంచి. అఫ్ కోర్స్ టాలెంట్స్ ను బాగా ఎంకరేజ్ చేసే శంకర్ నుంచి ఇలాంటి కుర్రాళ్లకు కాల్ రాలేదంటే ఆశ్చర్యం కానీ.. వస్తే ఏముంటుంది. మరి శంకర్, దుల్కర్ ను పిలిచింది ఏ సినిమా కోసమో తెలుసా..?

సౌత్ లో ఇప్పుడు బాగా వినిపిస్తోన్న క్లాసిక్ సీక్వెల్ భారతీయుడు. కమల్ హాసన్ ఆల్ టైమ్ గ్రేట్ మూవీస్ లో ఒకటిగా నిలిచే భారతీయుడుకు సీక్వెల్ రూపొందబోతోంది. భారతీయుడు-2గా రాబోతోన్న ఈ మూవీకి కూడా శంకరే దర్శకుడు. ఇప్పటికే ఈ పాత్ర కోసం కమల్ చాలా బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం శంకర్ దుల్కర్ సాల్మన్ ను తీసుకోవాలనుకుంటున్నాడట. ఆ మేరకు అతనికి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్లిందని చెబుతున్నారు. కాకపోతే ఈ మేటర్ దుల్కర్ కన్ఫర్మ్ చేయడం లేదు.. అలాగని ఖండించమూ లేదు. మరోవైపు దుల్కర్ తన స్పాన్ ను బాగా పెంచుకుంటున్నాడు. ఇప్పటికే తెలుగులో తన వాయిస్ తో ఆకట్టుకున్న దుల్కర్ బాలీవు్డ లోనూ ఎంట్రీ ఇచ్చాడు.

రీసెంట్ గా బాలీవుడ్ లో కార్వాన్ అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘జోయా ఫ్యాక్టర్’ అనే మరో సినిమా చేస్తున్నాడు. అటు మళయాలంలోనూ ఓ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. సో చూస్తోంటే మరి బిజీగా ఏం లేడు. కాబట్టి భారతీయుడులో ఉన్నాడనుకోవచ్చా..? 

More Related Stories