English   

తెలుగు సర్కార్ కూడా సేఫ్ అయ్యేలా ఉన్నాడే.. 

Vijay-Sarkar
2018-11-10 18:34:32

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్, కీర్తి సురేష్ జంటగా వచ్చిన సినిమా సర్కార్. ఎన్నాళ్లుగానో ట్రై చేస్తోన్న విజయ్ కి ఈ మధ్యే తెలుగులో కొంత మార్కెట్ పెరిగింది. ఆ పెరిగిన మార్కెట్ కు అనుగుణంగా కోలీవుడ్ లో తన మార్కెట్ కు ఏ సంబంధం లేకుండా ఇక్కడ ఈ సినిమాను అమ్మేశారు. 7కోట్ల 50లక్షలకు సర్కార్ థియేట్రికల్ రైట్స్ ను అమ్మేశారు. అయితే గతంలో అతని డిజాస్టర్ సినిమా స్నేహితుడు కూడా ఆరు కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది. అందుకే ఈ మూవీకి కొంత ఎక్కువే పెట్టారు. ఇక ఓ వైపు వివాదాలు.. మరోవైపు సినిమాకు వచ్చిన యావరేజ్ టాక్.. ఇవేవీ సినిమా రేంజ్ ఆపలేకపోయాయి. ఈ నెల 6న విడుదలైన సర్కార్ నాలుగు రోజుల్లోనే దాదాపు ఆరు కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. 

ప్రస్తుతం తెలుగులో సినిమాలేవీ లేకపోవడం.. సర్కార్ కు పోటీగా వచ్చిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ డిజాస్టర్ గా మారడంతో సర్కార్ కు బాగా కలిసొచ్చింది. దీనికి తోడు ఫస్ట్ హాఫ్ అంతా వెరీ ఎంగేజింగ్ గా ఉండటంతో మాగ్జిమం ఫిల్మ్ లవర్స్ ఈ సినిమాకు ఓటేస్తున్నారు. ఇక మరో వారం రోజుల వరకూ గట్టి పోటీ ఇచ్చే సినిమా లేదు కాబట్టి.. సర్కార్ ఆ కోటిన్నర కూడా కొల్లగొట్టే అవకాశాలున్నాయి. అంటే ఏడున్నర కోట్లతో మూవీ బ్రేక్ ఈవెన్ కు వచ్చేస్తుంది. లక్ బావుండి.. ఇంకా ఎక్కువే కలెక్ట్ చేస్తే డబ్బింగ్ నిర్మాత సేఫ్ అయినట్టే.. అయితే ఈ కలెక్షన్స్ చూపించి రాబోయే రోజుల్లో విజయ్ సినిమా తెలుగు డబ్బింగ్ థియేట్రికల్ రైట్స్ పెరుగుతాయనడంలో సందేహమే లేదు. 

More Related Stories