English   

మహర్షికి భలే రేట్ కుదిరింది

Maharshi
2018-11-10 12:33:58

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షికి భారీ రేట్ వచ్చింది. మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమాగా వస్తోన్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా ఇది. ఇది ఆ ముగ్గురికీ చేయాల్సిన సినిమాలకు కలిపి చేస్తోన్న ఒకే సినిమాగా మహేష్ బాబు వైపు నుంచి వినిపించే మాట. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు 25వ సినిమా కాబట్టి ఆ మైల్ స్టోన్ ను మెమరబుల్ గా మార్చుకోవాలనేలా ప్లాన్ చేసుకున్నట్టు టాక్. మహర్షిలో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. అతని వల్లే సినిమా పాయింట్ టర్న్ అవుతుందని టాక్. 

క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ గా వస్తోన్న మహర్షికి బాలీవుడ్ కు సంబంధించిన రైట్స్ ను ఓ భారీ రేట్ కు అమ్మేశారు. మామూలుగా బాలీవుడ్ లో సౌత్ యాక్షన్ సినిమాకు మంచి డిమాండ్ ఉంటుంది. కంటెంట్ కంటే ఎక్కువగా ఫైట్స్ ఉన్నాయా లేవా అని చూస్తారు అక్కడి ఆడియన్స్ . ముఖ్యంగా మన సినిమాలకు అక్కడి శాటిలైట్ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ కారణంగా వాళ్లు డబ్బింగ్ తో పాటు  శాటిలైట్ రేట్స్ ను కూడా టోకుగా కొనేస్తారు. ఈ నేపథ్యంలో మహర్షి సినిమాను 20 కోట్లకు డబ్బింగ్ అండ్ శాటిలైట్ కు అమ్మేసినట్టు చెబుతున్నారు. అయితే దిల్ రాజు ఈ మూవీకి పాతిక కోట్ల వరకూ ఎక్స్ పెక్ట్ చేశాడట. 

కానీ మహేష్ బాబు సినిమాల్లో ఫైట్స్ అంత బావుండవు కదా.. అందుకే అక్కడి వాళ్లు అంత పెట్టడానికి ఒప్పుకోలేదు. దీంతో ఫైనల్ గా 20 కోట్లకు డీల్ తెగ్గొట్టినట్టు సమాచారం. మొత్తంగా ఈ మధ్య కాలంలో రంగస్థలం కు 22 కోట్లు, అరవింద సమేతవీరరాఘవకు 18 కోట్ల డబ్బింగ్ అండ్ శాటిలైట్ రైట్స్ కు అమ్మేశారు. వాటితో పోల్చితే మహర్షిలో యాక్షన్ పార్ట్ తక్కువగా ఉంటుందని వాళ్లే చెబుతున్నారు కాబట్టి.. అక్కడి మార్కెట్ కు మహర్షికి మంచి రేటే వచ్చినట్టు చెప్పాలి. 

More Related Stories