English   

పూజాహెగ్డే ఆప్షన్ కాదు హీరోల ఛాయిస్

Pooja Hegde Wants Blockbuster Hit Because Aravinda Sametha Above Average
2018-11-10 22:32:08

స్టార్ హీరోలు వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు ఇస్తున్నా కూడా ఒక్క విజ‌యం కూడా అందుకోలేక‌పోతుంది ఈ భామ‌. మొన్న విడుద‌లైన అర‌వింద స‌మేత కూడా అబౌ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయింది కానీ హిట్ కాదు. ఇప్పుడు పూజా ఆశ‌ల‌న్నీ మ‌హేష్ బాబు, ప్ర‌భాస్ పైనే ఉన్నాయి. వాళ్ల‌తోనే ఇప్పుడు సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అన్న‌ట్లు ఇప్పుడు మ‌న హీరోలంద‌రికీ పూజాహెగ్డే ఆప్ష‌న్ కాదు.. ప‌క్కా తీసుకోవాల‌నిపించే ఛాయిస్. ఈ భామ కోస‌మే అంతా వేచి చూస్తున్నారు. అస‌లు ఏం మాయ చేస్తుంది పూజాహెగ్డే..? ఒక్క హిట్ కూడా లేకుండా ఎందుకు ఆ భామ వెంట అంద‌రు హీరోలు ప‌డుతున్నారు..? అంటూ అంతా బుర్ర‌లు బాదుకుంటున్నారు. దీనికి స‌మాధానం ఒక్క‌టే. స‌మంత‌, కాజ‌ల్, త‌మ‌న్నా లాంటి ముద్దుగుమ్మ‌లంతా ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు. ఇప్ప‌టికే వాళ్ల‌తో ఒక‌టికి రెండు సార్లు న‌టించేసారు మ‌న హీరోలు. దాంతో ఖచ్చితంగా కొత్త వాళ్ల‌కు చాన్స్ ఇవ్వాలి.

ఇప్పుడున్న వాళ్ల‌లో పూజాహెగ్డే.. కియారాఅద్వానీ మిన‌హా మ‌న హీరోల‌కు పెద్ద‌గా ఆప్ష‌న్ క‌నిపించ‌ట్లేదు. ర‌కుల్ ను కూడా లైట్ తీసుకోవ‌డంతో పూజానే అంద‌రికి ఛాయిస్ గా మారుతుంది. ఇదే ఆమెకు వ‌రంగా మారిపోయింది. మ‌హేష్ - వంశీ పైడిప‌ల్లి మ‌హ‌ర్షి సినిమాలో పూజా హీరోయిన్ గా న‌టిస్తుంది. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో పూజాకు ఇందులో అవ‌కాశం ద‌క్కింది. హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డంలో రాజుగారు దిట్ట‌. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంది పూజా. డిజే త‌ర‌హాలో ఈ సినిమాలోనూ అమ్మ‌డు ఫుల్లుగా అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించ‌నుంది. అక్క‌డ బికినీ అయితే ఇక్క‌డ కూడా అదే ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. ప్ర‌భాస్ సినిమాలో కూడా ఈ భామ‌నే హీరోయిన్ గా తీసుకున్నారు. స్వ‌యంగా ప్ర‌భాస్ ఈ విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసాడు కూడా. రాదాకృష్ణ దీనికి ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో హౌజ్ ఫుల్ 4 లో న‌టిస్తుంది పూజా. మొత్తానికి వ‌ర‌స సినిమాలు చేస్తుంది కానీ కెరీర్ మార్చే విజ‌యం కోసం మొహం వాచిపోయేలా చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

More Related Stories