English   

చరణ్ ఎన్టీఆర్ మూవీ RRR మీనింగ్ తెలుసా?

Ram Charan Jr NTR Multistarrer Movie RRR Meaning DIrected by Rajamouli
2018-11-11 06:44:54

రాజ‌మౌళి సినిమా అంటే హీరోతో పాటు విల‌న్ కు కూడా అదే ఇమేజ్ ఉంటుంది. ఆ సినిమాలో విల‌న్ ఎవ‌రో అని ముందు నుంచి ఆస‌క్తి ఉంటుంది. ఎందుకంటే హీరో కంటే రెండు ఆకులు ఎక్కువే చూపిస్తాడు విల‌న్ ను. ఆ త‌ర్వాత చివ‌ర్లో ఆ విల‌న్ ను హీరో కొడుకుంటే వ‌చ్చే మ‌జానే వేరు. ప్ర‌తీ సినిమాలో రాజ‌మౌళి చేసేది అదే. ఇప్పుడు కూడా ఈయ‌న ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. న‌వంబ‌ర్ 11న ఈ చిత్ర ఓపెనింగ్ భారీగా జ‌ర‌గ‌నుంది. ఆర్ఆర్ఆర్ అంటే రామ రావ‌ణ రాజ్యం అంటూ తెలుస్తుంది. ఈ చిత్రానికి ఇదే టైటిల్ ప‌క్కాగా స‌రిపోతుంద‌ని భావిస్తున్నాడు రాజ‌మౌళి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడు చేయ‌లేని సాహ‌సం చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ను హీరోలుగా తీసుకుని మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డం అంటే మాట‌లు కాదు. కానీ చేస్తున్నాడు రాజ‌మౌళి. చేసి చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు.

మ‌రోవైపు రాజ‌మౌళి కూడా ఈ మ‌ల్టీస్టార‌ర్ కోసం ప‌క్కా ప్లానింగ్ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇందులో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ధ్య అద్భుత‌మైన స‌న్నివేశాలు ఉంటాయంటున్నాడు రాజ‌మౌళి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కూడా దీనికోసం మ‌రింత శ్ర‌ద్ధ పెట్టాడు. న‌వంబ‌ర్ 11 నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ డేట్ కూడా చెప్ప‌నున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఇప్ప‌టికే దీనికోసం చ‌ర‌ణ్, ఎన్టీఆర్ వర్క్ షాప్ కూడా పూర్తైపోయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ అన్నాద‌మ్ములుగా న‌టిస్తార‌ని.. అందులో ఎన్టీఆర్ కు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉంద‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్యే జై ల‌వ‌కుశ‌లో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు ఎన్టీఆర్. ఇదే న‌మ్మ‌కంతో మ‌రోసారి అలాంటి పాత్ర‌నే చేయిస్తున్నాడు జ‌క్క‌న‌. ఇక ఈ చిత్రం పేరు రామ రావ‌ణ రాజ్యం పెట్ట‌డం.. అందులో రావ‌ణ క్యారెక్ట‌ర్ ఎన్టీఆర్ కు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. ఈయ‌న‌పై న‌మ్మ‌కంతో ఎన్టీఆర్ కూడా ఏమీ మాట్లాడటం లేద‌ని తెలుస్తుంది.

ఇక రామ్ చ‌ర‌ణ్ ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించ‌నున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ అక్ష‌రాలా 300 కోట్లు. దాన‌య్య ఈ చిత్రాన్ని భారీగానే నిర్మిస్తున్నాడు. ఇక రాజ‌మౌళి అయితే ఈ చిత్రంతో ఏకంగా 100 కోట్ల‌కు పైగానే ప్యాకేజ్ తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. ఎలాగూ ఈయ‌న‌ సినిమా అంటే హాట్ కేక్ క‌దా. 2020లో సినిమా విడుద‌ల కానుంది. మ‌రి ఎన్టీఆర్ తో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయించి.. చ‌ర‌ణ్ కు పాజిటివ్ ఇస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా..? ఏమో రాజ‌మౌళి ఏదైనా చేయ‌గ‌ల‌డు. మ‌రి చూడాలిక‌.. ఏం చేస్తాడో..? అన్న‌ట్లు ఈ చిత్రంలో పూజాహెగ్డే, కీర్తిసురేష్ హీరోయిన్లుగా ఫైన‌ల్ అయ్యార‌ని తెలుస్తుంది.

More Related Stories