English   

సర్కార్ కు నిప్పంటించాలని చూసారు.. కానీ?

Vijay’s Sarkar Worldwide Box Office Collections
2018-11-11 07:43:05

స‌ర్కార్ విడుద‌లైన రోజు టాక్ చూస్తే ఈ సినిమా క‌నీసం సేఫ్ అవుతుందా..? త‌మిళ‌నాట అంటే ఎలాగోలా విజ‌య్ ఉన్నాడు కాబ‌ట్టి ఓపెనింగ్స్ వ‌స్తాయి కానీ సినిమా నిల‌బ‌డుతుందా అనే అనుమానాలు ఉండేవి. కానీ నాలుగు రోజుల త‌ర్వాత అన్నీ పటాపంచ‌లు అయిపోయాయి. కేవ‌లం నాలుగంటే నాలుగు రోజుల్లో 150 కోట్లు వ‌సూలు చేసిందంటే ఈ చిత్రం ప్ర‌భంజ‌నం ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా కూడా ఈ చిత్రం సంచ‌ల‌నాలే క‌నిపిస్తున్నాయి. త‌మిళ‌నాట అయితే నాలుగు రోజుల్లోనే 80 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఇక తెలుగులో కూడా విజ‌య్ కు మార్కెట్ లేదు అంటూనే యావ‌రేజ్ టాక్ తో నాలుగు రోజుల్లోనే 6 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇక్క‌డ కూడా 10 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే స‌ర్కార్ బ్లాక్ బ‌స్ట‌ర్ కిందే లెక్క‌. త‌మిళ‌నాట కూడా ఈ చిత్రం దూకుడు ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. దానికి కార‌ణం త‌మిళ్ స‌ర్కార్ అన్నాడిఎంకేనే.

వాళ్లు కానీ వివాదం రేప‌క‌పోయి ఉండుంటే స‌ర్కార్ నిజంగానే యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయుండేది. కానీ వాళ్లు నిప్పు అంటించారు.. దెబ్బ‌కు స‌ర్కార్ క‌లెక్ష‌న్లు మంట మండుతున్నాయి. ఇప్ప‌టికీ ఎక్క‌డా క‌లెక్ష‌న్ల దూకుడు త‌గ్గ‌డం లేదు. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఇప్పుడు వీకెండ్ పూర్త‌య్యే నాటికి సినిమా ఈజీగా సేఫ్ జోన్ కి రావ‌డం కాదు లాభాలు తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. గ‌తేడాది అదిరిందితో తొలి విజ‌యం అందుకున్న విజ‌య్.. వ‌ర‌స‌గా రెండో విజ‌యం కూడా ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం 135 కోట్లు వ‌స్తే హిట్ అన్న‌మాట‌.. ఇప్ప‌టికే దాదాపు 100 కోట్ల‌కు పైగానే షేర్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. స‌ర్కార్ చివ‌రివ‌ర‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం మాత్రం ఖాయ‌మే. ఎందుకంటే మ‌రో వారం రోజుల వ‌ర‌కు ఎక్క‌డా ఏ సినిమాలు లేవు కాబ‌ట్టి. ఇక్క‌డ ల‌క్ ఏంటంటే థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ కూడా డిజాస్ట‌ర్ కావ‌డం.

More Related Stories