English   

కాంగ్రెస్ చేసిన పనికి చిరంజీవి హర్ట్ అయ్యాడు

Megastar Chiranjeevi Quits Congress Party Membership
2018-11-11 10:14:41

అవును.. ఇప్పుడు నిజంగానే రాజ‌కీయాలంటే చిరంజీవికి చిరాకు ప‌డుతున్నాడు. ఇప్పుడు ఈయ‌న పూర్తిగా రాజ‌కీయాల‌కు సెల‌వు ఇవ్వాల‌ని చూస్తున్నాడు. రెండేళ్లుగా రాజ‌కీయాల‌కు అంటీ ముట్ట‌న‌ట్లుగానే ఉన్నాడు చిరంజీవి. కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత త‌ను రాజ‌కీయంగా చేసేది కూడా ఏం లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయ్యాడు మెగాస్టార్. దాంతో ఇప్పుడు అన్న‌య్య‌ రాజ‌కీయ నాయ‌కుడు నుంచి మెగాస్టార్ అయిపోయాడు. ఇప్ప‌టికే ఖైదీ నెంబ‌ర్ 150తో ర‌ప్ఫాడించాడు. ఇక ఇప్పుడు ఉయ్యాల‌వాడ న‌రసింహారెడ్డి జీవిత చ‌రిత్ర‌తో బిజీగా ఉన్నాడు చిరు. ఇదిలా ఉంటే రాజ‌కీయాల‌కు ఇక సెల‌వు ప్ర‌క‌టించ‌బోతున్నారు చిరంజీవి.

పైగా చిరు మొన్న‌టి వ‌ర‌కు హీరోతో పాటు ఎంపి కూడా. అంటే ఎక్క‌డో ఓ మూల ఇంకా రాజ‌కీయ నాయ‌కుడే. అయితే మూన్నెళ్ల కింద ఈ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కూడా ముగిసింది. దాంతో రాజ‌కీయాల్లో పూర్తిగా విముక్తుడు అయిపోయాడు చిరు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేయ‌బోతున్నాడు మెగాస్టార్. టీడిపితో పార్టీ క‌ల‌వ‌డంతో చిరు బాగా హ‌ర్ట్ అయ్యాడ‌ని.. అందుకే రాజీనామా చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఆ లేఖ‌ను సోనియాకు పంప‌నున్నాడు మెగాస్టార్. ఇదిలా ఉంటే త‌మ్ముడు జ‌న‌సేన వైపు అన్న‌య్య అడుగులు ప‌డుతున్నాయ‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. మొత్తానికి ప్ర‌స్తుతానికి అయితే రాజ‌కీయాల‌కు పూర్తిగా దూరంగా ఉన్నాడు చిరంజీవి. మ‌రి ఫ్యూచ‌ర్ ఎలా ఉండ‌బోతుంద‌నేది మెగాస్టార్ కే తెలియాలి.

More Related Stories