English   

టాక్సీవాలాలో దెయ్య‌మే కాదు.. విష‌యం కూడా ఉంది.. 

Vijay-Deverakonda
2018-11-12 15:08:41

టాక్సీవాలా సినిమాపై ముందు నుంచి ఎందుకో తెలియ‌దు కానీ ఓ ర‌క‌మైన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. కానీ ఇప్పుడు విడుద‌ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఈ సినిమాపై ఆస‌క్తి పెరిగిపోతుంది. ప్ర‌మోష‌న్స్ అలా చేసుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఇక గీత‌గోవిందం వ‌చ్చిన త‌ర్వాత ఈయ‌న‌కు పిచ్చోళ్లైపోతున్నారు కుర్రాళ్లు. విజ‌య్ సినిమా అంటే ఇప్పుడు కుర్రాళ్ల‌కు బాగా పిచ్చి. నోటా ఫ్లాప్ అయినా కూడా విజ‌య్ మాత్రం స‌క్సెస్ అయ్యాడు. అయితే ఇప్పుడు టాక్సీవాలా మాత్రం ఈయ‌న కెరీర్ కు కీల‌కంగా మారింది. విజ‌య్ మంచి న‌టుడు అనేది అంద‌రికీ తెలిసిందే కానీ ఇక్క‌డ న‌ట‌న కంటే ముఖ్యంగా విజ‌యం కావాలి. ఇప్పుడు నోటాతో అది దూర‌మైంది ఈ హీరోకు. ఇప్పుడు విడుద‌లైన టాక్సీవాలా ట్రైల‌ర్ చూస్తుంటే అది వ‌చ్చేలా క‌నిపిస్తుంది మ‌ళ్లీ. ఇన్నాళ్లూ ఈ సినిమాపై పెద్ద‌గా అంచ‌నాలు లేక‌పోయినా కూడా ఇప్పుడు ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఆస‌క్తి పెరిగిపోతుంది. 

క‌చ్చితంగా సినిమాలో ఏదో విష‌యం ఉంద‌ని అర్థ‌మైపోతుంది. కాక‌పోతే ఇన్ని రోజులు ఆల‌స్యంగా వ‌స్తుంది క‌దా అందుకే అంచ‌నాలు లేవు. నిజానికి ట్యాక్సీవాలాపై ఎలాంటి అంచ‌నాలు కానీ.. ఆస‌క్తి కానీ క‌నిపింక‌డం లేదు. రాహుల్ సంక్రీత్య‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. టీజ‌ర్ విడుద‌ల చేసారు.. జూన్ లోనే రావాల్సిన సినిమా ఇప్పుడు వ‌స్తుంది. అయితే ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా కాస్త ప్ర‌మోట్ చేసుకుంటే ఏదో ఒక‌టి జ‌రుగుతుంద‌ని న‌మ్ముతున్నారు నిర్మాత‌లు. విజ‌య్  ఉన్నాడు కాబ‌ట్టి కాస్త పుష్ చేస్తే చాలు సినిమా ఒడ్డున ప‌డిపోతుంద‌ని న‌మ్ముతున్నారు వాళ్లు. ట్రైల‌ర్ లో హార్ర‌ర్ తో పాటు కామెడీని కూడా మిక్స్ చేసారు. ఈ రెండు స‌రిపాళ్ల‌లో క‌లిసాయంటే ఫార్ములా సూప‌ర్ హిట్. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? 

More Related Stories