English   

ఓవ‌ర్సీస్ లో ఎన్టీఆర్ బ‌యోపిక్ సంచ‌ల‌నం.. 

balakrishna
2018-11-12 16:46:03

ఎన్టీఆర్ బ‌యోపిక్ పై ఇప్పుడు అంచ‌నాలు ఆకాశంలో ఉన్నాయి. అస‌లు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రేక్ష‌కులు కూడా పెద్దాయ‌న బ‌యోపిక్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో బిజినెస్ కూడా అలాగే జ‌రుగుతుంది. ఈ చిత్రం బాల‌య్య కెరీర్ లోనే హైయ్య‌స్ట్ బ‌డ్జెట్ తో రూపొందుతుంది. బిజినెస్ కూడా అలాగే జ‌రుగుతుంది. ఇండియాలో ఎలాగూ ఎన్టీఆర్ బ‌యోపిక్ కు తిరుగులేదు. ఇప్పుడు ఓవ‌ర్సీస్ లో కూడా సినిమా కుమ్మేస్తుంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 25 కోట్ల‌కు ఎన్టీఆర్ ఓవ‌ర్సీస్ హ‌క్కులు అమ్ముడు అయిపోయాయ‌నే వార్త‌లు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తుంది. 

రెండు భాగాల‌కు క‌లిపి 25 కోట్ల‌కు డీల్ ముగించారని.. క్రిష్, బాల‌య్య కాంబినేష‌న్ లో వ‌చ్చిన గ‌త సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఓవ‌ర్సీస్ లో 1.7 మిలియ‌న్ వ‌సూలు చేయ‌డంతో ఆ క్రేజ్ ఇప్పుడు ప‌నికొచ్చింద‌ని చెబుతున్నారు బ‌య్య‌ర్లు. పైగా ఎన్టీఆర్ బ‌యోపిక్ కాబ‌ట్టి అక్క‌డ కూడా ఆస‌క్తి ఉంటుంది. ఇదే సినిమాకు శ్రీ‌రామ‌ర‌క్ష‌. సంక్రాంతి సీజ‌న్ కావ‌డం మ‌రో విశేషం. ఇలా అన్నీ క‌లిసొచ్చి ఈ చిత్రాన్ని ఇంత భారీ రేట్ కు అమ్మాల‌ని ఫిక్సైపోయారు. 25 కోట్లు అంటే చిన్న విష‌యం కాదు. రెండు భాగాల‌కు క‌లిపి 5 మిలియ‌న్ వ‌స్తే కానీ సినిమా సేఫ్ కాదు. మ‌రి అంత తీసుకొచ్చే ద‌మ్ము ఎన్టీఆర్ లో ఉందా లేదా అనేది వ‌చ్చే ఏడాది సంక్రాంతికి తేల‌నుంది. 

More Related Stories