అదుగదుగో అందాల నిధి బ్రాబోయ్..

నిధి అంటేనే ఖజానా అని అర్థం. ఇక ఇదే పేరు ముద్దుగుమ్మ పెట్టుకుంటే అందాల ఖజానా అని అర్థం. ఇప్పుడు నిధి అగర్వాల్ ను చూస్తుంటే ఇదే అనాలనిపిస్తుంది. చిన్నపుడే అనుకున్నారో ఏమో కానీ ఈమెకు సరైన పేరు పెట్టారు. ఇప్పుడు ఈ అందాల నిధిని చూడ్డానికి రెండు కళ్లు కూడా సరిపోవడం లేదు. అంతగా మాయ చేస్తుంది ఈభామ. బాలీవుడ్ లో ఇప్పటికే నిధి అగర్వాల్ గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ మున్నా మైఖెల్ లో టైగర్ ష్రాఫ్ కు జోడీగా నటించింది. అందులో అందాలన్నీ ఆరబోసింది నిధి. అసలు మొహమాటం అనే పదానికి అర్థం కూడా తెలియదు ఈ భామకి. అంతగా అందాల నిధి బయట పెడుతుంది.
ఈ మధ్యే సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో నిధి ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరితో అఖిల్ చేస్తోన్న మిస్టర్ మజ్ను సినిమాలోనూ హీరోయిన్ గా నిధినే తీసుకున్నారు. అన్న హ్యాండిచ్చినా తమ్ముడు కచ్చితంగా ఆడుకుంటాడని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రోజుకో విధంగా హాట్ హాట్ గా దర్శనం ఇస్తూ సోషల్ మీడియాకే సెగలు పుట్టిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ తన అందాలతో వేడెక్కించింది. నల్లడ్రస్సులో నిధిని చూసి అంతా ఫిదా అయిపోయారు. ఎంతైనా బాలీవుడ్ బ్యూటీ కదా.. అక్కడ్నుంచి వచ్చిన బుద్దులు ఎక్కడికి పోతాయి..? మరి చూడాలిక.. ఈ అందాల నిధి తెలుగులో ఎంత వరకు సక్సెస్ అవుతుందో..!