English   

క‌నీసం క‌థ కూడా చెప్ప‌వా రాజ‌మౌళి..?

Rajamouli
2018-11-12 18:18:42

ఈ రోజుల్లో స్టార్ హీరోతో సినిమా అంటే మాట‌లు కాదు. క‌థ విష‌యంలోనే చాలా తంటాలు ప‌డాలి ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కు న‌చ్చితే స‌రిపోదు.. అత‌డి చుట్టూ ఉన్న వాళ్ల‌కు కూడా ఆ క‌థ న‌చ్చాలి అప్పుడే అది ఓకే అయి ప‌ట్టాలెక్కుతుంది. హీరోల డామినేష‌న్ ఇంత‌గా న‌డుస్తున్న ఇండ‌స్ట్రీలో త‌న మార్క్ చూపిస్తున్నాడు రాజ‌మౌళి. క‌నీసం క‌థ కూడా చెప్ప‌కుండా ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను ఒకే తాటిపైకి తీసుకొచ్చాడు ద‌ర్శ‌క‌ధీరుడు. రామ్ చ‌ర‌ణ్.. ఎన్టీఆర్ లాంటి హీరోల‌తో ఈయ‌న మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. దీనిపై ఇప్ప‌టికే ఎన్టీఆర్ మాట్లాడుతూ త‌న‌కు ఇంకా రాజ‌మౌళి క‌థే చెప్ప‌లేద‌ని షాకింగ్ న్యూస్ చెప్పాడు. మొన్న చ‌ర‌ణ్ కూడా ఇదే మాట చెప్పిన‌ట్లు గుర్తు త‌న‌కు అన్నాడు యంగ్ టైగ‌ర్. ఇదంతా ఒక‌ప్ప‌టి మాట‌. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కూడా క‌థ ఇంకా చెప్ప‌లేద‌నేది లేటెస్ట్ న్యూస్. 
  
ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు క‌థ చెప్ప‌లేద‌ని.. జ‌స్ట్ ఓ లైన్ మాత్ర‌మే చెప్పాడని చెప్పాడు ఎన్టీఆర్. సినిమాపై పూర్తి క్లారిటీ ఓ మంచి రోజు చూసుకుని రాజ‌మౌళి ఇస్తాడ‌ని చెప్పాడు ఈ హీరో. ఎంత రాజ‌మౌళి అయినా ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ఉన్నారు క‌దా క‌చ్చితంగా క‌థ చెప్పే ఉంటాడులే అనుకున్న వాళ్ల‌కు ఎన్టీఆర్ ఆన్స‌ర్ దిమ్మ తిరిగేలా చేసింది. నిజంగా రాజ‌మౌళి క‌థ చెప్ప‌కుండానే ఇదంతా చేసాడా అనుకుని షాక్ లో ఉన్నారంతా. క‌థ చెప్ప‌కుండా ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో ఓ సినిమా అనౌన్స్ చేసిన రాజ‌మౌళి ధైర్యాన్ని చూసి అంతా వావ్ అనుకుంటున్నారు. న‌వంబ‌ర్ నుంచే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ఆ లోపు ఇద్ద‌ర్ని సిద్ధంగా ఉండాల‌ని మాత్ర‌మే వీళ్ల‌కు చెప్పాడు ద‌ర్శ‌క ధీరుడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుందో..? ఏది ఎలా ఉన్నా మ‌ల్టీస్టార‌ర్ మాత్రం పోటాపోటీగా ఉంటుంద‌ని చెప్పాడు యంగ్ టైగ‌ర్. ఈయ‌న మాట‌ల్ని బ‌ట్టి చూస్తుంటే ఈ మ‌ల్టీస్టార‌ర్ తో రికార్డులేవీ మిగిల్చేలా క‌నిపించ‌ట్లేదు జ‌క్క‌న‌. ఇది ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే 2020 వ‌ర‌కు ఆగాల్సిందే..!

More Related Stories