English   

మ‌మ్ముట్టిగారు.. మీ సంస్కారానికి న‌మస్కారం.. 

Sudheer-Babu
2018-11-12 18:26:52

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 45 ఏళ్లైపోయింది.. వందల సినిమాల్లో న‌టించాడు.. కానీ ఇప్ప‌టికీ ఆయ‌న సంస్కారం చూస్తుంటే ముచ్చ‌టేస్తుంది. మెగాస్టార్ ఇమేజ్ ఉన్నా కూడా కాస్త కూడా క‌ల్మ‌షం లేని మ‌న‌సు మ‌మ్ముట్టి సొంతం. కేవ‌లం కేర‌ళ ప్రేక్ష‌కుల‌కే కాదు సౌత్ ఇండియ‌న్ అభిమానులంద‌రికీ మ‌మ్ముట్టి ప‌రిచ‌యమే. తెలుగులో స్వాతికిర‌ణం సినిమాలో న‌టించాడు ఈయ‌న‌. ఇప్పుడు ఈయ‌న గురించి ఎందుకు అంటే యాత్ర సినిమాతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్నాడు మ‌మ్ముట్టి. ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది.. డ‌బ్బింగ్ సంద‌ర్బంగా మ‌రో హీరో సుధీర్ బాబును క‌లిసారు మ‌మ్ముట్టి. 

ఆ ఫోటోలో విన‌యంగా మ‌మ్ముట్టి చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డ‌టం చూస్తుంటే ముచ్చ‌టేస్తుంది. అస‌లు అంత‌టి స్టార్ హీరో అయ్యుండి.. అలా చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డ‌టం ఏంటో అర్థం కాలేదు.. అంత గొప్ప‌ది ఆయ‌న సంస్కారం. ఇదే విష‌యాన్ని సుధీర్ బాబు కూడా రాసుకొచ్చాడు ట్విట్ట‌ర్ లో. ఆయ‌న అనుభ‌వం నా వ‌య‌సు కంటే పెద్ద‌ది.. అలాంటి లెజెండ్ ను క‌లిసిన‌పుడు ఏం మాట్లాడ‌తాం.. వాళ్ల నుంచి నేర్చుకోవ‌డం త‌ప్ప అంటూ రాసుకొచ్చాడు. ఈయ‌న కూడా యాత్ర‌లో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మొత్తానికి కొన్ని ద‌శాబ్దాల త‌ర్వాత మ‌మ్ముట్టి మ‌ళ్లీ తెలుగులోకి వ‌స్తున్నాడు. చూడాలిక‌.. ఈ యాత్ర ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories