English   

థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఫ్లాప్.. మ‌హేష్ హ్యాపీ..

Thugs-Of-Hindustan
2018-11-12 18:43:55

అదేంటి.. అమీర్ ఖాన్ సినిమా ఫ్లాప్ అయితే మ‌హేష్ బాబు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.. మ‌రీ అంత శ‌త్రుత్వం ఏముంది అనుకుంటున్నారా..? ఏం లేదు.. అమీర్, మ‌హేష్ మ‌ధ్య ఏం అంత చెప్పుకోద‌గ్గ శ‌త్రుత్వం లేదు కానీ ఇప్పుడు థ‌గ్స్ ఫ్లాప్ కావ‌డం మ‌హేష్ బాబుకే మంచి జ‌రిగింది. దీని వెన‌క కూడా ఓ క‌థ ఉంది. నిజానికి ఇప్పుడు మ‌హేష్ బాబు హీరో మాత్ర‌మే కాదు.. బిజినెస్ మ్యాన్ కూడా. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు సినిమాలు త‌ప్ప మ‌రో ప్ర‌పంచం లేద‌ని చెప్పిన మ‌హేశ్.. ఇప్పుడు ఒక్కొక్క‌టిగా త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తూ వెళ్తున్నాడు. 

ఇప్ప‌టికే ఏషియ‌న్ ఫిల్మ్ ఓన‌ర్ సునీల్ నారంగ్ తో క‌లిసి మ‌ల్టీప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నాడు సూప‌ర్ స్టార్. ఇప్పుడు మ‌ల్టీప్లెక్సుల‌కు ఉన్న ఆద‌ర‌ణ చూసిన మ‌హేశ్.. ఇందులో 150 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డి పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌చ్చిబౌలి ఓపెన్ స్థ‌లాల్లో ఈ మ‌ల్టీప్లెక్సుల నిర్మాణం పూర్తైంది కూడా. న‌వంబ‌ర్ 8న అమీర్ ఖాన్ థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతోనే ఈ మ‌ల్టీప్లెక్స్ ఓపెన్ చేయాల‌ని భావించాడు మ‌హేష్ బాబు. దాని కోసం హైద‌రాబాద్ కు అమీర్ ఖాన్ ను తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించాల‌నేది మ‌హేష్ ప్లాన్. 

అయితే మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉండి రాలేక‌పోయాడు. దాంతో ఈయ‌న కూడా త‌న ప్లాన్ మార్చుకున్నాడు. అయితే థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ విడుద‌లై డిజాస్ట‌ర్ అయిపోయింది. అందుకే ఇప్పుడు మ‌హేష్ హ్యాపీగా ఫీలవుతున్నాడు. ఇంత ఖ‌ర్చు చేసి నిర్మించిన మ‌ల్టీప్లెక్స్ ఫ్లాప్ సినిమాతో ఓపెన్ అయివుంటే క‌చ్చితంగా ఫీల‌య్యే వాడు మ‌హేష్ బాబు. అందుకే ఆయ‌న రాలేదు.. ఈయ‌న బ‌తికిపోయాడు. ఆరు భారీ స్క్రీన్లు ఉండేలా ఈ మ‌ల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి AMB స్క్రీన్స్ అనే పేరు పెడుతున్నారు. మ‌రోవైపు మ‌ల్టీప్లెక్సులే కాదు.. కాస్మోటిక్స్ వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. ఇప్ప‌టికే తాను చాలా కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. ఇందులోనే ఓ టాప్ కంపెనీతో క‌లిసి టై అప్ అవుతున్నాడు మ‌హేశ్. ఇందులో మ‌హేశ్ వాటా 70 కోట్లుగా తెలుస్తోంది. ఈ రెండు బిజినెస్ ల‌తో పాటు మ‌రికొన్ని బిజినెస్ ల‌పై కూడా మ‌హేశ్, న‌మ్ర‌తా శిరోద్క‌ర్ క‌న్నేసిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఓ వైపు సినిమా రంగంలో సూప‌ర్ స్టార్ గా వెలిగిపోతూనే.. మ‌రోవైపు బిజినెస్ లోనూ దుమ్ము దులిపేయాల‌ని చూస్తున్నాడు మ‌హేశ్ బాబు.

More Related Stories