English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. స్టైల్ ఐకాన్ ఆఫ్ టాలీవుడ్.. 

Vijay-Devarakonda
2018-11-12 19:30:03

త‌ప్పేం లేదు ఇప్పుడు ఈ బిరుదు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇవ్వ‌డంలో. ప‌క్క‌నే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నా కూడా క‌ళ్ల‌న్నీ త‌న‌పైనే ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న డ్రస్సింగ్.. క్యాస్ట్యూమ్ అన్నీ టాక్సీవాలా ప్రీ రిలీజ్ లో భ‌లే హైలైట్ అయ్యాయి. అస‌లు ఆ డ్ర‌స్ ఏంటో.. ఎలా ఉంటుందో.. ఎక్క‌డ్నుంచి మొదలైందో కూడా అర్థం కాన‌ట్లే ఉన్నా కూడా చూడ్డానికి మాత్రం భ‌లే ఉంది. ఒక‌టి రెండు మూడు అంటూ చాలా బ‌ట్ట‌లే వేసుకున్నాడు విజ‌య్. లోన బ‌య‌ట అన్నీ వేసుకుని పైన వేలాడే జాకెట్ ఒక‌టి వేసుకుని ఏదో కొత్త‌గా క‌నిపించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పైగా నోట్లా టూత్ పిక్ ఒక‌టి పెట్టుకుని ఈవెంట్ అంతా సంద‌డి చేసాడు. బ‌న్నీ ఉన్నా కూడా కెమెరా క‌ళ్లు మాత్రం విజ‌య్ వైపు వెళ్లిపోయాయి. 

అలా మాయ చేసాడు ఈ కుర్ర హీరో. రౌడీ క్ల‌బ్ అంటూ ఒక‌టి ఓపెన్ చేసి.. అందులో త‌న ట్రెండ్స్ వేసి కుర్రాళ్ల‌కు బాగా చేరువ అయిపోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. గీత‌గోవిందం ప్రీ రిలీజ్ కు లుంగీ క‌ట్టుకుని వ‌చ్చిన ఈ కుర్ర హీరో ఇప్పుడు వెరైటీ క్యాస్ట్యూమ్ తో వ‌చ్చాడు. మ‌రోసారి అంద‌రి దృష్టి త‌న వైపుకు తిప్పుకున్నాడు. అప్పుడు బ‌న్నీ చీఫ్ గెస్ట్ గా వ‌చ్చాడు.. ఇప్పుడు కూడా ఆయ‌నే వ‌చ్చాడు. మ‌రి అప్పుడు క‌లిసొచ్చిన సెంటిమెంట్ ఇప్పుడు కూడా క‌లిసొస్తుందా..? ఏమో న‌వంబ‌ర్ 17న తేల‌నుంది. చూద్దాం ఏమ‌వుతుందో..? అయితే ఒక్క‌టి మాత్రం నిజం.. ఎవ‌రేం అనుకున్నా కూడా విజ‌య్ మాత్రం న్యూ స్టైల్ ఐకాన్ ఆఫ్ తెలుగు సినిమా. 

More Related Stories