English   

అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా.. తెలియ‌దు బ్ర‌ద‌ర్..

Allu-Arjun
2018-11-12 19:45:52

అదేంటి.. కొంప‌దీసి ఇదే కానీ టైటిల్ అనుకుంటున్నారా..? అంత సీన్ లేదు లెండీ కానీ బ‌న్నీ మ‌రోసారి పాత పాటే పాడాడు. నెక్ట్స్ సినిమా ఏంటి బాసూ అని అబిమానులు అడిగితే ఎప్ప‌ట్లాగే తెలియ‌దు బ్ర‌ద‌ర్ అంటూ న‌వ్వుతూ స‌మాధానం ఇచ్చాడు. తాజాగా టాక్సీవాలా ప్రీ రిలీజ్ వేడుక‌లో క‌నిపించిన బ‌న్నీ.. ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌కు తాజాగా మాజీ స‌మాధాన‌మే ఇచ్చాడు. ఇన్నేళ్ళ కెరీర్ లో అల్లు అర్జున్ ఇప్పటి వరకు సస్పెన్స్ డ్రామా చేయలేదు. కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లో మాత్రం చేస్తూనే ఉన్నాడు. తన నెక్ట్స్ సినిమా కోసం అభిమానులు వేచి చూస్తున్నారని తెలిసినా కూడా ఆ ఒక్క విషయంలో మాత్రం రిస్క్ తీసుకోలేకపోతున్నాడు ఈ హీరో. నా పేరు సూర్య తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు బన్నీ. ఆ మ‌ధ్య‌ జ‌రిగిన గీతాగోవిందం ఆడియో వేడుక.. ఇప్పుడు టాక్సీవాలా ప్రీ రిలీజ్ వేడుక‌.. ఇలా విజ‌య్ దేవ‌ర‌కొండ రెండు సినిమాల వేడుక‌ల‌కు వ‌చ్చాడు బ‌న్నీ కానీ స‌మాధానం మాత్రం మార్చ‌లేదు. 

అదే మాట మీద నిల‌బ‌డ్డాడు. నెక్ట్స్ సినిమా ఏంటో ముందు నాకు తెలిస్తే బాగున్ను.. మీకు చెప్పడానికి అంటూ అప్పుడు తప్పించుకున్న బ‌న్నీ ఇప్పుడు తెలియ‌దు బ్ర‌ద‌ర్ అనేసాడు. వీలైనంత త్వరలో చెప్తాను ఇంకొన్ని రోజులు వేచి చూడండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఈయన తర్వాతి సినిమా కోసం చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముందు నుంచి అనుకుంటున్న‌ట్లు విక్ర‌మ్ కే కుమార్ ను ప‌క్క‌న‌బెట్టి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ వైపు అడుగేస్తున్నాడు బ‌న్నీ. ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధ‌మైపోయింది కానీ నిర్మాతే ఇంకా ఫైన‌ల్ కాలేద‌ని తెలుస్తుంది. దానిపై క్లారిటీ రాగానే అఫీషియ‌ల్ గా అనౌన్స్ మెంట్ రానుంది. అయితే డిసెంబ‌ర్ లోనే ఈ చిత్రం ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి చూడాలిక‌.. తెలియ‌దు బ్ర‌ద‌ర్ అంటూ బ‌న్నీ ఇంకెన్నాళ్లూ ఒకే ఆన్స‌ర్ క్యారీ చేస్తాడో..? 

More Related Stories