అల్లు అర్జున్.. ఏంటి ఆ రేటు..!

అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. ఈయన బయటికి వచ్చేప్పుడు చాలా చక్కగా పద్దతిగా వస్తుంటాడు. ఈయన స్టైల్ మేకింగ్ కూడా చాలా మందికి నచ్చుతుంది. ఇక ఇప్పుడు టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఓ టీ షర్ట్ లో వచ్చాడు బన్నీ. చూడ్డానికి అది చాలా సింపుల్ గా ఉంది. కానీ రేట్ మాత్రం అస్సలు సింపుల్ కాదు బ్రో.. మధ్యతరగతి వాడికి ఏడాదంతా సరిపోయే ఖర్చుతో ఆ ఒక్క టీ షర్ట్ వచ్చింది. అంత రేట్ పెట్టి మరీ కొన్నాడు.
బన్నీ వేసుకున్న టీ షర్ట్ కంపెనీ గివెన్ చై. దాని రేట్ అక్షరాలా 66 వేలు. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. గివెన్ చై అనే కంపెనీ నుంచి ఆన్ లైన్ షాపింగ్ లో కొన్నాడు ఈ హీరో. దాని రేట్ తెలిసి అంతా షాక్ అవుతున్నారిప్పుడు. కానీ అంత రేట్ పెట్టారు అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఉంటుందనేగా అర్థం. ఏదేమైనా ఇప్పుడు కాస్టూమ్ విషయంలో బన్నీ చూపించే శ్రద్ధ భలే ఉంటుంది. ఇప్పుడు ఈ టీ షర్ట్ కూడా దెబ్బకు ఫేమస్ అయిపోయింది. టాక్సీవాలా ప్రీ రిలీజ్ వేడుకలో బన్నీ టీ షర్ట్ కూడా బాగానే ట్రెండ్ అవుతుంది.