English   

పూరీ మాయ‌లో ప‌డిపోయిన దేవ‌దాస్.. 

Hero-Ram
2018-11-13 08:13:27

పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా అంటే ఇప్పుడు హీరోల‌కు పెద్ద‌గా ఇష్టం లేదు. ఆయ‌న ఒక‌ప్ప‌ట్లా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు కాదు క‌దా క‌నీసం యావ‌రేజ్ సినిమాలు కూడా చేయ‌డం లేదు. ఇప్పుడు ఈయ‌న దృష్టి కూడా స్టార్ హీరోల కంటే కూడా త‌న మాట వినే కుర్ర హీరోల వైపు వెళ్తుంది. అయితే వాల్లు కూడా పూరీని న‌మ్మ‌డం లేదు. ఇప్పుడు ఈయ‌న ఎలాగోలా రామ్ ను త‌న క‌థ‌తో ఒప్పించాడ‌ని తెలుస్తుంది. ఇప్పుడు ఈయ‌న చేసిన కొత్త లుక్ కూడా పూరీ కోస‌మే అని తెలుస్తుంది. మ‌రోవైపు రామ్ కెరీర్ ఇప్పుడు కూడా దారుణంగా ఉంది. మూడు ఫ్లాపుల‌తో మ‌నోడు ఎటూ కాకుండా ఉన్నాడు. నేనుశైల‌జ త‌ర్వాత వ‌ర‌స‌గా హైప‌ర్.. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ.. హ‌లో గురు ప్రేమ‌కోస‌మే అంచ‌నాలు అందుకోలేదు. అయినా ఏ హీరోకైనా రెండు మూడు సార్లు కెరీర్ లో డేంజ‌ర్ బెల్ మోగుతుంది. 

అప్ప‌టికి కూడా అలాగే ఉంటాను.. మార‌ను అంటూ ఆ డేంజ‌ర్ బెల్ కాస్తా మ‌రింత గ‌ట్టిగా మోగుతుంది. అది మోగితే మొత్తానికి ష‌ట్ డౌన్ చేసి ఇంట్లో కూర్చోవ‌చ్చు. అలా రొటీన్ క‌థ‌లు చేసి ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఖాళీగానే కూర్చున్నారు. అయితే త‌న‌కు ఆ ప‌రిస్థితి రాకుండా ముందు నుంచి జాగ్ర‌త్త ప‌డుతున్నాడు రామ్. ఇప్ప‌టికే ఈయ‌న వ‌ర‌స‌గా మూడో ఫ్లాప్ కు చేరువ‌గా వ‌చ్చాడు. నేనుశైల‌జ త‌ర్వాత ఈయ‌న చేసిన హైప‌ర్ డిజాస్ట‌ర్.. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ మంచి సినిమాగా నిలిచిపోయింది. మొన్న విడుద‌లైన హ‌లో గురు ప్రేమ‌కోస‌మే కూడా ప‌ర‌మ రొటీన్ ఎంట‌ర్ టైన‌ర్ గా నిలిచింది. ఇందులో కొత్త‌ద‌నం అనేది పొర‌పాటున కూడా ఏ మూల‌న లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు త్రినాథ‌రావ్ న‌క్కిన‌. చూపించే మ‌ళ్లీ మ‌ళ్లీ చూపించి ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్టించేసారు. ఇప్పుడు విడుద‌లైన హ‌లో గురు కూడా ఇదివ‌ర‌కు వ‌చ్చిన నేనులోక‌ల్.. సినిమా చూపిస్తా మావాకు సేమ్ టూ సేమ్ ఉన్నాయి. దాంతో ప్రేక్ష‌కులు నో అనేసారు. దాంతో పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాకు క‌నెక్ట్ అవుతున్నాడు రామ్. అటు ఇటూ మైన‌స్ ల‌తోనే ఉన్న ఈ చిత్రం ఎలా ముందుకెళ్తుంది.. ఎలా రామ్ కెరీర్ కు ప్లస్ అవుతుంద‌నేది చూడాలిక‌.

More Related Stories