English   

‘చోటా’పై మాటల్లేవా..?

Chota-K-Naidu
2018-11-13 16:17:10

ప్రతిభావంతమైన కెమెరా మెన్ గా పేరు తెచ్చుకున్న చోటా కే నాయుడు.. వ్యక్తిత్వంలో మాత్రం అంత గొప్ప వ్యక్తిగా అనిపించడు. ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా ఉంటూ కూడా కనీసం స్టేజ్ మేనర్స్ తెలియకుండా ప్రవర్తించడం పరిశ్రమకు దిగ్భ్రాంతికి గురి చేసింది.. గురి చేసింది అని చెప్పుకుంటున్నారు కానీ.. ఒక్కరు కూడా దీని గురించి ఓపెన్ గా మాట్లాడ్డం లేదంటేనే తెలుస్తుంది.. మన తెలుగులో హీరోయిన్లు ఎంత సేఫ్టీగా ఉంటారో.. ఒకవైపు మీ టూ అంటూ పెద్ద పెద్ద స్టార్స్ పై కూడా ఆరోపణలు వస్తోంటే.. ఇప్పుడు ఓ సీనియర్ సినిమటోగ్రాఫర్ అయిన చోటా కే నాయుడు కాజల్ ను బహిరంగ వేదికపై ముద్దుపెట్టుకోవడం సంచలనమైంది. ఏమైనా అప్రిసియేట్ చేయాలనుకుంటే పర్సనల్ గా చేయొచ్చు. కానీ ఇలా ఓ వేదికపై ముద్దుపెట్టడం మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. అలాంటి సందర్భాల్లో ఎలా రియాక్ట్ కావాలి అని ఎవరూ ట్రైన్ అయి ఉండరు. అయినా కాజల్ కాస్త హుందాగానే ప్రవర్తించింది. ఈ విషయంపై తను మీ టూ అంటూ రచ్చకెక్కితే ఈ నాయుడు ఏం చేస్తాడు అనేది కూడా ఆలోచించాలి.. 

నిజానికి చోటా కే నాయుడులో ఎంత ప్రతిభ ఉందో అంత యారోగెంట్ అనేది అందరికీ తెలుసు. మనోడికి కులపిచ్చి కూడా ఎక్కువే అని అతనే ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. వ్యక్తిత్వం లేని ప్రతిభ రాణించదు అనేది ఎన్నోసార్లు విన్నాం. అయినా చోటా కే నాయుడు రాణిస్తున్నాడంటే కారణం కులమే అని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకున్నట్టే.. ఇప్పుడు నిశ్శబ్ధంగా ఉన్న పరిశ్రమా ఒప్పుకున్నట్టే. నిజానికి ఇలాంటి వ్యవహారాలపై ఆదిలోనే స్పందిస్తే ముందు ముందు జరగవు. కానీ మనాళ్లలో ఒక్కరూ దీనిపై రియాక్ట్ కావడం లేదు.. పైగా అల్లు అర్జున్ నిన్నటికి నిన్నే టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నాడు.. తెలుగులో మాత్రమే హీరోయిన్లకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు అని. మరి అందులో ఎంత నిజముందో అలాంటి ఓ పబ్లిక్ స్టేజ్ పైనే తేలిపోయిందిగా.. ఏదేమైనా ఛోటా కే నాయుడు వంటి వారిపై పరిశ్రమ కనీసంగా అయినా ఏదో ఒక చర్య తీసుకోకపోతే ఇలాంటివి మరిన్ని జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు.

More Related Stories