English   

నీ‘కవచం’ప్రామిసింగ్ గా ఉంది శ్రీనివాస్...

Kavacham-Teaser
2018-11-13 17:19:02

బెల్లంకొండ శ్రీనివాస్.. ఒక్క భారీ హిట్ కోసం బాగా ఎదురుచూస్తోన్న కుర్రాడు. బోయపాటి శ్రీను వంటి దర్శకుడు కూడా శ్రీనివాస్ కోరికను పూర్తిగా నెరవేర్చలేకపోయాడు. ఓ మాస్ హీరో కావడానికి అన్ని లక్షణాలున్నాయని సాక్ష్యంతో సహా నిరూపించినా కుర్రాడికి ఇంకా అలాంటి హిట్ పడటం లేదు. అఫ్ కోర్స్ కాస్త ప్రామిసింగ్ హీరోగానే పేరు తెచ్చుకున్నాడు. అందుకే పెద్ద విజయాలు లేకపోయినా వరుస సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ‘కవచం’తో వస్తున్నాడు శ్రీనివాస్. ఈ మూవీలో ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన టీజర్ వెరీ ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. 

కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ టీజర్ ఓ చిన్న కథ చెబుతున్నట్టుగా ఆరంభమవుతుంది. అది కాస్త ‘రాజా ది గ్రేట్’ను తలపించినా.. వెంటనే మాస్ టర్న్ తీసుకుని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ క్రమంలో శ్రీనివాస్ చెప్పిన ‘‘భయపెట్టేవాడికి.. భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుండాడు.. వాడే పోలీస్’’ అనే డైలాగ్ ఆకట్టుకుంది. మాటగానే కాదు.. అతను చెప్పిన విధానంలోనూ ఆకట్టుకుంది. కుర్రాడు కాస్త ఇంప్రూవ్ అయినట్టు కూడా అర్థమవుతుంది. తర్వాత ‘ఎవరికీ చెప్పకండి’ అంటూ కాజల్ ఎంట్రీ.. తను దానికి ‘వీలైతే అందరికీ చెప్పండి’  అనే శ్రీనివాస్ డైలాగ్.. ఈ మొత్తంలో ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఎక్కడో లింక్ కట్టయింది అనే మాటే ఈ సినిమాకు ప్రధాన బలంగా తెలుస్తోంది. ఆ కట్ అయిన లింకే ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ అని టీజర్ లోనే అర్థమైంది.

మొత్తంగా ‘పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే వేగంగా మైండ్ పనిచేయాలి అనే డైలాగ్ అదిరిపోయింది. ఓవరాల్ గా కవచం కాస్త ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. చూస్తోంటే బెల్లకొండ పోలీస్ యూనిఫామ్ ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతోంది. 

More Related Stories