English   

సుకుమార్ పై నమ్మకం లేకేనా మహేష్..?

Mahesh-Babu
2018-11-13 17:59:34

మహేష్ బాబు.. ఒకప్పుడు చాలా స్లోగా సినిమాలు చేస్తాడనే పేరున్న హీరో. అందుకే నైన్టీస్ లోనే ఎంట్రీ ఇచ్చినా.. తనకంటే వెనక వచ్చిన హీరోల వెనక 25వ సినిమా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచాడు. కానీ అది కూడా సరిపోవడం లేదు.  ప్రస్తుతం ఆయన చేస్తోన్న మహర్షి 25వ సి నిమా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా ఓ సూపర్ సబ్జెక్ట్ తో ఈ మూవీ రూపొందుతున్నట్టు టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో సేంద్రియ వ్యవసాయం గురించి చర్చించబోతున్నట్టు సమాచాం.. వచ్చే యేడాది ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది ‘మహర్షి’.. 

మహర్షి తర్వాత మహేష్ బాబు.. సుకుమార్ డైరెక్షన్ లో సినిమాకు ఓకే చెప్పాడు. మొదట్లో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్య కథతో మహేష్ ను అప్రోచ్ అయ్యాడు సుకుమార్. కానీ అతను రిజెక్ట్ చేశాడు. కారణం కథ నచ్చకో లేక.. ప్రాంతీయ భేదం వస్తుందనో కాదు.. ఆ పాయింట్ తో సినిమా అంటే డిఫరెంట్ గెటప్ లో ఉండాలి. ఉన్నా ఇబ్బంది లేదు.. కానీ సుకుమార్ సినిమాను విపరీతంగా చెక్కుతాడు.. నెలల తరబడి చిత్రీకరిస్తాడు. అన్నాళ్లు అదే గెటప్ లో ఉండటం మహేష్ కు ఇష్టం లేదు. ఎందుకంటే అతను స్పీడ్ పెంచడానికి డిసైడ్ అయ్యాడు. అందుకే సుకుమార్ చెప్పిన ఆ కథకు నో చెప్పాడు. ఇక మార్చి చివరి వారంలో సుకుమార్ తో( ఈలోగా మరో కథ  ఫైనల్ అయితే) సినిమా ప్రారంభం అవుతుంది. అయితే 2019లోనే మరోసినిమా కూడా పూర్తి చేయాలనేది మహేష్ ఆలోచన. అందుకే సుకుమార్ సినిమా ఓ షెడ్యూల్ పూర్తి కాగానే మే లేదా జూన్ లో మరో సినిమా మొదలుపెట్టాలనుకుంటున్నాడట. దీంతో 2019లో మహర్షితో పాటు మరో సినిమా కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్. 

ఒక రకంగా సుకుమార్ పై నమ్మకం లేకే ఇలా సైమల్టేనియస్ గా మరో సినిమాకు కమిట్ కావాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ లోగా యంగ్ స్టర్స్ చెప్పే కథలకు ప్రియారిటీ ఇవ్వాలని.. వాటిలో కూడా ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండే ఎంటర్టైనర్స్  ఉంటే బెటర్ అనుకుంటున్నాడట.. అదీ మేటర్. 

More Related Stories