English   

శ్రీను వైట్లలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

Sreenu-Vaitla
2018-11-13 18:06:44

ఒకప్పుడు ఒకే కథతో వరుస విజయాలు సాధించిన అదృష్టవంతుడు శ్రీను వైట్ల. అప్పుడు దానికి ట్రెండ్ కలిసొచ్చింది. బట్ ఏ ట్రెండూ ఎక్కువ కాలం ఉండదు. కానీ శ్రీను మాత్రం ఎక్కువ కాలం అదే ట్రెండ్ అనుకున్నాడు. అందుకే వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు. ఇక మనోడి పని అయిపోయింది అనుకుంటోన్న టైమ్ లో రవితేజ మరో ఛాన్స్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి చేసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఈ నెల 16న వస్తోంది. ఇప్పుడు రవితేజ పరిస్థితి కూడా ఏమంత బాలేదు. అయినా ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఏదో ఎంటర్టైన్మెట్ అయినా గ్యారెంటీ అనుకుంటున్నారు. ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి కాబట్టి.. ఇక ఈ మూవీతో ఆరేళ్ల తర్వాత గోవా కోవా ఇలియానా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. తనే డబ్బింగ్ కూడా చెప్పుకుంది.అందుకు కారణం శ్రీను వైట్ల ప్రోత్సాహమే అని ఆనందంగా చెప్పింది అమ్మడు. దాంతో పాటు మరో క్రెడిట్ కూడా వేసుకున్నాడు శ్రీను. ఒకప్పుడు తన సినిమాల్లో మాంటేజ్ సాంగ్స్ కు తనే డ్యాన్స్ కంపోజ్ చేసేవాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. ఇప్పుడు శ్రీను వైట్ల కూడా అమర్ అక్బర్ ఆంటోనీలో ఏకంగా రెండు పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేశాడట. అంతే కాదు.. ఒక్క ఫైట్ సీక్వెన్స్ తప్ప మిగతావి కూడా తనే డిజైన్ చేశాడట. బడ్జెట్ పరిమితుల వల్ల చేశాడా లేక నిజంగానే తనలో ఆ టాలెంట్ ఉందా అనేది తెలియదు కానీ.. ఇప్పుడు శ్రీను వైట్ల డ్యాన్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఏమై ఉంటాయా అని ఆలోచిస్తున్నారు ఆడియన్స్.. 

More Related Stories