English   

అనసూయ కూడా ‘యాత్ర’కు వెళ్లింది

Anasuya
2018-11-13 18:25:12

అనసూయ భరద్వాజ్.. బుల్లితెరపై పొట్టి డ్రెస్ లు వేసిన ఫస్ట్ లేడీగా రికార్డ్ క్రియేట్ చేసింది. బుల్లితెరపై పెద్ద స్టార్డమ్ తెచ్చుకుని తర్వాత వెండితెరపైన అడుగులు వేసింది. కాకపోతే సిల్వర్ స్క్రీన్ పై సెలెక్టివ్ రోల్స్ మాత్రమే చేస్తోంది. అందుకే చాలా తక్కువ పాత్రలు చేసినా.. క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో తను మెమరబుల్ రోల్స్ చేసింది. అలాంటి పాత్రే మరొకటి చేస్తున్నట్టుగా తను చేసిన ట్వీట్ సెన్షేషన్ గా మారింది. యస్.. తనిప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లో అనసూయ నటిస్తోంది. ఈ విషయాన్ని తనే చెప్పడంతో ఇక మేటర వైరల్ గా మారింది. అంటే తనేదో గ్రేట్ యాక్ట్రెస్ అని కాదు.. కానీ ఏ పాత్ర చేస్తుందా అనే ఆరాలు తీయడంలో వైరల్ అయింది. అంతే. 

ఇక యాత్ర మూవీ లొకేషన్ లో తను వెనక నుంచి తీయించుకున్న ఫోటో ట్వీట్ చేసింది అనసూయ. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్ట అనసూయ రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకురాలిగా కనిపిస్తుందట. మరి ఆ నాయకురాలు ఎవరు అనేది ప్రేక్షకుల ఊహకే వదిలేసింది. మొత్తంగా యాత్రపై రోజు రోజుకూ ఇంట్రెస్ట్ పెరుగుతోంది. జగపతిబాబు, రావు రమేష్, సుహాసిని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిలో సుహాసిని మాజీ హో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో నటిస్తోందని ముందే చెప్పారు. ఇక రావు రమేష్ మాత్రం వైఎస్ ఆత్మగా చెప్పుకున్న కెవిపి రామచంద్రరావు పాత్రలో నటిస్తున్నాడట. మరి జగ్గూభాయ్ క్యారెక్టర్ ఏంటనేది తెలియాలి. పాఠశాల, ఆనందోబ్రహ్మ చిత్రాలు డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి మెయిన్ ఎస్సెట్ మాత్రం వైఎస్ పాత్రలో నటిస్తోన్న మమ్మూట్టి అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు.

More Related Stories