English   

గోపీచంద్ భలే షాకిచ్చాడే..?

Gopichand
2018-11-13 18:41:24

వరుస ఫ్లాపుల్లో ఇబ్బందిపడుతోన్న హీరో గోపీచంద్. మంచి కెరీర్ ను చేజేతులా కామెడీ పాలు చేసుకుని దెబ్బయిపోయిన హీరోగా గోపీచంద్ ను సింపుల్ గా చెప్పొచ్చు. నిజమే.. యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ ను కాదనుకుని లౌక్యంగా కామెడీ చేయాలనుకున్నాడు. అది కాస్తా సౌఖ్యంగా లేకపోవడంతో మళ్లీ ఫామ్ లోకి రావడానికి జిల్ మనిపించాలనుకున్నా సరిపోలేదు సరికదా.. ఈ గౌతమ్ నందాకు కెరీర్ కు ఆక్సీజన్ ఇచ్చే సినిమా కోసం ఎంత పంతం పట్టినా పనవడం లేదు. ఇలాంటి టైమ్ లో అతను ఓ షాక్ ఇచ్చాడు. కొందరికి ఇది కామెడీగా అనిపిస్తే.. మరికొందరికి కెరీర్ కోసం తీసుకున్నీ సీరియస్ నిర్ణయంగా తోస్తోంది. ఎవరికి ఎలా తోచినా.. అతను ఓ హీరోయిన్ ను తోసిరాజని చెప్పి షాక్ ఇచ్చాడు. 

ప్రస్తుతం గోపీచంద్ తమిళుడైన తిరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా 25వ సినిమాగా వచ్చిన పంతం పోవడంతో ఈ సారి కోలీవుడ్ డైరెక్టర్ పై నమ్మకం పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానాను తీసుకుందాం అన్నాడట దర్శకుడు. తనైతే బావుంటుందని కూడా చెప్పాట్ట. కానీ గోపీచంద్ మాత్రం ఠాట్.. తనిప్పుడు ఫామ్ లో లేదు. పైగా మన తెలుగోళ్లు ఎప్పుడో మర్సిపోయారు. ఇంకా తననేం చూస్తారు అన్నాట్ట. దీంతో అసలే ఆ దర్శకుడు కూడా అక్కడ పెద్ద హిట్లు లేక ఇబ్బందిపడుతున్నాడు. దీంతో వీరోగారు ఏం చెబితే అదే అంటూ ఇలియానా మాటను క్కనెట్టేశాడట.అయితే ఇలియానాకు ఎంత గ్యాప్ వచ్చినా క్రేజ్ అయితే ఉంది కదా.. అనవసరంగా గోపీ పక్కనెట్టాడా అనుకుంటున్నారు. మరికొందరు.. ఇద్ద్రరూ ఫ్లాపుల్లో ఉన్నారు కదా.. మరీ బావోదు అనుకుని ఉంటాడు అనుకుంటున్నారు..  ఏదేమైనా గోపీచంద్.. ఇలియానాకు భలే షాకిచ్చాడు.. 

More Related Stories