English   

మంచు ల‌క్ష్మితో జ్యోతిక‌ చిందేస్తే ట్రెండింగే

Manchu Lakshmi Jyothika’s Jimikki Kammal Song Trending in Youtube
2018-11-14 10:50:01

ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది.. అలా ఒక సినిమా చేసి మ‌ళ్లీ వెళ్లిపోతుందేమో అనుకున్నారంతా.. కానీ జ్యోతిక మాత్రం ఇక్క‌డే ఉండాల‌ని ఫిక్సై వ‌చ్చిన‌ట్లుంది. అందుకే వ‌రస సినిమాల‌కు క‌మిట‌వుతుంది. ఆ మ‌ధ్య మెర్స‌ల్ లో ముందు నిత్యామీన‌న్ క్యారెక్ట‌ర్ కు జ్యోతిక‌నే తీసుకున్నారు కానీ త‌ర్వాత వ‌ద్ద‌నుకుంది ఈ భామ‌. 36 వ‌య‌దినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. ఈ మ‌ధ్యే ఈమె న‌టించిన మ‌గిల‌ర్ మ‌ట్టుం విడుద‌లై ఫ్లాపైంది. మ‌గిల‌ర్ మ‌ట్టుం అంటే ఆడాళ్ల‌కు మాత్ర‌మే అని అర్థం. మ‌గిల‌ర్ మ‌ట్టుంతో పాటు ఈమె బాల ద‌ర్శ‌క‌త్వంలో నాచియార్ సినిమా చేసింది. ఇది కూడా యావ‌రేజ్ గానే ఆడింది. ఈ సినిమాలో రౌడీ పోలీస్ గా ర‌ప్ఫాడించింది జ్యోతిక‌.

ఇక ఇప్పుడు మాట్రిన్ కోళిలో మ‌రో కొత్త కోణం చూపిస్తుంది ఈ భామ‌. హిందీలో సూప‌ర్ హిట్ అయిన విద్యాబాల‌న్ సినిమా తుమ్హారీ సులుకు రీమేక్ ఇది. న‌వంబ‌ర్ 16న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో మంచు ల‌క్ష్మి కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. జ్యోతిక‌ బాస్ గా ల‌క్ష్మి న‌టించింది. ఇద్ద‌రూ క‌లిసి ఇప్పుడు మోహ‌న్ లాల్ సూప‌ర్ హిట్ సాంగ్ జిమ్మిక్కి క‌మాల్ పాట‌కు స్టెప్పులు కూడా వేసారు. రాదామోహ‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై భారీ ఆశ‌లే పెట్టుకుంది జ్యోతిక. ఇప్పుడు ఈ పాట కూడా బాగానే ట్రెండ్ అవుతుంది యూ ట్యూబ్ లో. మొత్తానికి ఇన్నాళ్లూ పిల్ల‌లు చిన్న‌గా ఉన్నార‌ని లైట్ తీసుకున్న జ్యోతిక‌.. ఇప్పుడు ఆ లోటు కూడా భ‌ర్తీ చేసేలా క‌నిపిస్తోంది. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ ను సూర్య అర్థాంగి బాగా సీరియ‌స్ గా తీసుకుంది.

More Related Stories