English   

రవితేజ, శ్రీను వైట్లకు హిట్ కీలకం.. మరి సెన్సార్ చెప్తుంది

Ravi Teja’s Amar Akbar Anthony Movie Censor Talk
2018-11-14 04:17:43

మాస్ మహరాజ్ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తోన్న మూవీ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ తో ప్రామిసింగ్ గా కనిపించిందీ మూవీ. కాకపోతే కంటెంట్ మాత్రం క్లియర్ గా తెలియలేదు. రవితేజ మూడు పాత్రల్లో కనిపించినా ఆ ముగ్గురూ ఒక్కడే అన్న విషయం మాత్రం తెలుస్తోంది. ఇక ఆరేళ్ల తర్వాత ఈ మూవీతో ఇలియానా తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

ప్రస్తుతం రవితేజ అండ్ శ్రీను వైట్లకు ఈ మూవీ చాలా కీలకం. ఇద్దరూ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు.అందుకే రవితేజ తన ట్రబుల్ షూటర్ అన్నాడు శ్రీను వైట్ల. కానీ అతను కూడా చాలా ట్రబుల్స్ లో ఉన్నాడు. కాబట్టి.. వీరి ట్రబుల్ ను ఒకరికి ఒకరు క్లియర్ చేసుకుంటారా అనేది చూడాలి. ఇక ఎంటర్టైన్మెంట్ పరంగా ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీని థ్రిల్లర్ అని కూడా చెప్పేవాళ్లున్నారు.

మొత్తంగా ఈ నెల 16న విడుదల కాబోతోన్న  ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి అమర్ అక్బర్ ఆంటోనీకి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే సినిమాపై సెన్సార్ నుంచి పూర్తి స్థాయిలో టాక్ రావడం లేదు. మామూలుగా ఏ సినిమాకైనా అడగకుండానే హింట్స్ ఇచ్చే సెన్సార్ వాళ్లు ఈ సినిమా విషయంలో కాస్త సైలెన్స్ మెయిన్టేన్ చేస్తున్నారు.అయితే ఇన్ సైడ్ సోర్స్ ను బట్టి.. ఈ మూవీ రవితేజ, శ్రీను గత సినిమాల కంటే చాలా బెటర్ గా ఉంటుంది కానీ.. ఇద్దరికీ ట్రబుల్ షూటర్ కాకపోవచ్చు అంటున్నారు. చూద్దాం.. మరి అన్ని వేళలాసెన్సార్ టాక్ ఫైనల్ కాదు కదా.. ఏమో.. ఈ మూవీ పెద్ద హిట్ కావొచ్చేమో..

More Related Stories