English   

‘చోటా’చేసింది తప్పుకాదట

Chota-K-Naidu
2018-11-14 14:16:59

రీసెంట్ ఓ ఓపెన్ డయాస్ పై హీరోయిన్ కాజల్ ను ముద్దుపెట్టుకున్నాడు సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు. ఆ సందర్భంలో అతని ప్రవర్తన అసభ్యంగా ఉందని డిజిటల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. కొందరు అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఒకవైపు దేశమంతా ‘మీ టూ’ ఉద్యమం నడుస్తోంటే ఓ బహిరంగ వేదికపై ఇలా చేయడం కరెక్ట్ కాదని సినిమా పెద్దలు కూడా చోటాకు అక్షింతలు వేసినట్టు సమాచారం. కానీ తన చేసింది తప్పే కాదంటున్నాడు చోటా.. రెండు రోజులుగా తనపై వస్తోన్న విమర్శలపై లేటెస్ట్ గా ఓపెన్ అయ్యాడు నాయుడు.

‘‘కాజల్ తో పనిచేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. నాకు కాజల్ తో మంచి బంధం ఉంది. మేం ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలకు పనిచేశాం. ఎవరు ఎలాంటి వారమో మా ఇద్దరికీ బాగా తెలుసు. తను నన్ను వారి ఫ్యామిలీ మెంబర్ లా ఫీలవుతుంది. మరి ఇలాఎందుకు చేశానంటే తను రీసెంట్ గా ఓ మంచి ప్రాజెక్ట్ కు సైన్ చేశానని చెప్పింది. నిజంగా అది మంచి ప్రాజెక్ట్.. అందుకే ప్రశంసా పూర్వకంగా అలా చేశాను. ఇది చాలా చిన్న విషయం’’ అంటూ మేటర్ లైట్ తీసుకుంటున్నట్టు ఇన్ డైరెక్ట్ గా తేల్చాడు.. 

అయినా ఈ సోదంతా ఎందుకు సింపుల్ గా అలా జరిగిపోయింది.. దానికి సారీ అంటూ ఓ చిన్న మాట అనేస్తే అయిపోతుంది కదా. వాళ్ల మధ్య ఏ బంధం ఉన్నా అది పర్సనల్. దాన్ని అలాగే ఉంచాల్సింది. అన్నలానో, తమ్ముడిలానో లేక ఫ్యామిలీ ఫ్రెండ్ లానో ఏదో ఒకటి. కానీ ఓపెన్ డయాస్ పై ముద్దుపెట్టడం.. ఆ క్రమంలో అసభ్యంగా తాకడం మాత్రం నిజంగా తప్పే.. అది ఒప్పుకోకుండా మరి ఇలా మాట్లాడుతున్నాడంటే అతను తను చేసిన పనని సమర్థించుకుంటున్నట్టే కదా.. 

More Related Stories