English   

సమంత, నయనతార హీరోయిన్లుగా కొత్త సినిమా

Samantha-Nayan
2018-11-14 16:39:50

సమంత మళ్లీ కోలీవుడ్ కు వెళుతోంది. మరోసారి తన లక్కీ హీరోతోనే సినిమా చేయబోతోంది. అది కూడా నయననతారతో కలిసి.. ప్రస్తుతం కోలీవుడ్ లో నయనతార అంటే లేడీ సూపర్ స్టార్. కథ నచ్చి.. అందులో తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే తప్ప ఇతర హీరోల సినిమాల్లో నటించేందుకు ఒకే చెప్ప లేదు నయన్. అలాగే సమంత కూడా.  అలాంటి  ఈ బ్యూటీస్ ఇద్దరూ ఒకే సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారంటే అందులో కంటెంట్ గురించి కొత్తగా చెప్సేదేముందీ. ఇంతకీ ఈ భామలు నటిస్తోన్న సినిమాలో హీరో ఎవరో తెలుసా.. విజయ్.. యస్.. కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ సరసన సమంత, నయన్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈ మేటర్ ఆల్మోస్ట్ అఫీషియల్ అంటున్నారు. 

సర్కార్ సినిమాతో మరో హిట్ బ్యాగ్ చేసుకున్న విజయ్ ఈ సారి మళ్లీ తన ఫేవరెట్ డైరెక్టర్ ఆట్లీకే ఛాన్స్ ఇచ్చాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరి, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ రెండు సినిమాలతోనే విజయ్ కూడా తెలుగులో కాస్త మార్కెట్ పెంచుకున్నాడు. అందుకే మరోసారి ఆట్లీకే ఛాన్స్ ఇచ్చాడు విజయ్. నిజానికి ఈ కథ రజినీకాంత్ కు చెప్పాడు ఆట్లీ. కానీ ఆయన నో చెప్పాడు. దాన్ని కాస్త మార్పులు చేసి విజయ్ కి వినిపించాడు. ఇతను ఓకే చెప్పాడు. ఇక తన కెరీర్ బెస్ట్ మూవీ అనదగ్గ చిత్రం నయనతారకు ఇచ్చింది ఆట్లీనే. అతని ఫస్ట్ మూవీ ‘రాజా రాణి’లో నయన్ హీరోయిన్ గా నటిచింది. అందుకే ఈ మూవీలో నటించేందుకు ఒప్పుకుందనుకోవచ్చు. ఇక ఆట్లీ, విజయ్ కాంబోలో వచ్చిన తెరి, మెర్సల్ సినిమాల్లో హీరోయిన్ గా సమంతే నటించింది. సెంటిమెంట్ గా హ్యాట్రిక్ మూవీకీ తననే కంటిన్యూ చేస్తున్నారు. మొత్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ సంక్రాంతికి ప్రారంభం అవుతుంది. మళ్లీ 2019 దసరా లేదా దీపావళికి విడుదల అవుతుంది. 

More Related Stories