English   

ఎన్టీఆర్ చరణ్ మూవీ ఆర్ఆర్ఆర్.. సెన్షేషనల్ అప్డేట్స్..?

Rajamouli Tarak Ram Charan’s Movie RRR Latest Updates
2018-11-15 09:36:01

రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ప్రారంభానికి ముందే సెన్షేషనల్ ప్రాజెక్ట్ గా మారిన ఈ సినిమా ఈ నెల 11న చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథుల సమక్షంలో ప్రారంభమైంది. అయితే ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే దీనికి ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అందుకు మీనింగ్ గా రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అని చెప్పారు. కానీ ఇందులోనే అసలు టైటిల్ కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. పైగా ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తోన్న వార్తలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. మామూలుగానే తన సినిమాలను హైప్ చేయడంలో రాజమౌళిది అందెవేసిన టాలెంట్. ఆ టాలెంట్ ను ఈ మూవీకి కూడా ఉపయోగిస్తున్నాడు. కాకపోతే ఇవేవీ ఫేక్ న్యూస్ కాలేదు ఇప్పటి వరకూ. అందుకే ఈ మూవీపై వినిపిస్తోన్న వార్తలు కూడా మాగ్జిమం నిజమే కావొచ్చు అంటున్నారు. ఇంతకీ ఈ మూవీపై వినిపిస్తోన్న ఆ సెన్షేషనల్ న్యూస్ ఏంటో తెలుసా..?

ఆర్ఆర్ఆర్ మూవీ 1920 బ్యాక్ డ్రాప్ లో సాగే కథట. ఆ టైమ్ లో జరిగిన కథ అంటే ఖచ్చితంగా రాజమౌళి మరోసారి విజువల్ ఎఫెక్ట్స్ తో ఆడియన్స్ ను ఆ టైమ్ కే తీసుకువెళతాడు. అయితే ఇప్పటి వరకూ వచ్చినా వార్తల్లో ఖచ్చితమైన వార్త అంటే ఇదే అనేది ఇన్ సైడ్ సోర్స్ చెబుతోన్న మాట. అంటే సినిమా ఖచ్చితంగా 1920 బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుందన్నమాట. ఇక ఈ ఇద్దరి పాత్రలు ఎలా ఉంటాయనే దానిపై పూర్తి క్లారిటీ లేదు కానీ.. ఈ మూవీ టైటిల్ కూడా మాగ్జిమం కన్ఫార్మ్ అయింది. దాన్ని బట్టి వారి పాత్రలను ఊహించుకోవచ్చు అంటున్నారు.

‘‘రామరాజ్యంలో రావణుడు’’.. ఇదే టైటిల్.. ఆల్రెడీ యంగ్ టైగర్ జై లవకుశలో రావణ్ పాత్ర చేసి ఉన్నాడు కాబట్టి మరోసారి అతను బ్యాడీగా కనిపిస్తాడా అనేది తెలియదు కానీ.. ఈ టైటిల్ కు అనుగుణంగా వర్కింగ్ టైటిల్ కు ఆర్ఆర్ఆర్ అని పెట్టారని తెలిసిపోతోంది. ఏదేమైనా ఇకపై ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు రాసేవాళ్లంతా ఇదే రాస్తారేమో.. ‘రామరాజ్యంలో రావణుడు’ అని..

More Related Stories