అబ్బాయిలు ఎప్పుడూ ‘దానిగురించే’ ఆలోచిస్తారా..?

అబ్బాయిలు ఎప్పుడూ ఏం ఆలోచిస్తారు.. ఇదీ తమన్నా అడిగిన మాట. డౌటా.. దాని గురించే.. 24/7 దాని గురించే ఆలోచిస్తారు.. ఇదీ నవదీప్ సమాధానం. అదేంటీ అనేది ఎవరి ఊహలకు వాళ్లకు వదిలేయాల్సిందే. అయితే ఇదంతా వీరి కొత్త సినిమా ‘నెక్ట్ ఏంటీ’ టీజర్ లోని డైలాగ్. అఫ్ కోర్స్ ఈ మూవీలో హీరో సందీప్ కిషన్. కానీ ఈ డైలాగ్ చెప్పింది నవదీప్ తో. అన్నట్టు ఈ టీజర్ లో నవదీప్ లుక్ భలే ఉంది. ఏజ్డ్ పర్సన్ గా కనిపించేందుకు తెల్ల రంగు వేశారు.. గడ్డానికి కూడా. మరి అంత ఏజ్డ్ గా ఎందుకు కనిపిస్తాడనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనే అనుకోవాలి. ఇక సందీప్ కిషన్ పాత్ర ప్లే బాయ్ లా ఉంది. ఉన్నది ఒకటే జీవితం కాబట్టి వీలైనంతగా అనుభవించాలనేది మనోడి పాలసీలా ఉంది. తమన్నా ఎప్పట్లానే క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ గురించి సడెన్ గా అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది ఓ బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించిన సినిమా.
హిందీలో ‘హమ్ తుమ్’, ‘ఫనా’ వంటి సెన్సిబుల్ మూవీస్ తీసిన కునాల్ కోహ్లీ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది.. మొత్తంగా తమన్నా సంగతి పక్కన బెడితే ఈ మూవీతో సందీప్ కిషన్ కు అయినా మళ్లీ బ్రేక్ వస్తుందేమో చూడాలి. ఇక నవదీప్ గెటప్ ను బట్టే అతనికి బ్రేక్ అవసరం లేదు.. ఆఫర్స్ ఉంటే చాలు అనే విషయం అర్థమైపోయింది.